అంబులెన్స్ లో డెలివరీ

ములకలపల్లి, వెలుగు: మండలంలోని పాత గుండాలపాడు గ్రామానికి చెందిన కొండ్రు రాధ మంగళవారం పురిటి నొప్పులు రావడంతో ఆశకార్యకర్త108 అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. అన్నపురెడ్డిపల్లి108 సిబ్బంది బాధితురాలు దగ్గరికి చేరుకొని ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. అంబులెన్స్ లో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. 

దీంతో ఈఎంటీ నాగరాజు, పైలెట్ రాజా అంబులెన్స్ నిలిపి రాధకి అక్కడే డెలివరీ చేశారు. రాధ పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. వీరిని భద్రాచలం ఏరియా హాస్పిటల్ లో అడ్మిట్ చేయగా, కుటుంబ సభ్యులు ఈఎంటీ, పైలట్ కు కృతజ్ఞతలు తెలిపారు.