చాలా టెక్ కంపెనీల్లో ఉద్యోగులు ఇంకా వర్క్ ఫ్రం హోం చేస్తున్న విషయం తెలిసిందే.. వర్క్ ఫ్రం హోం వద్దు.. ఆఫీసు కు వచ్చి పనిచేయాలి.. లేక పోతే ఉద్యోగాలు ఊడుతాయి అని గత కొంతకాలంగా కంపెపీలు హెచ్చరిస్తున్నాయి. దీనికి కొంత మంది టెకీలు ఒప్పుకొని ఆఫీసుల్లో పనిచేస్తున్నా.. చాలా మంది ఇందుకు సిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో ప్రముఖ ల్యాప్ టాప్ బ్రాండ్ అయిన డెల్ కంపెనీ.. తన ఉద్యోగులను ఆఫీసులకు రప్పించేందుకు కొత్త ప్లాన్ వేసింది. ఇందులో భాగంగా .. మీరు ఇంటినుంచి వర్క్ చేయొచ్చు ..కానీ మీకు ప్రమోషన్లు ఉండవని లింక్ పెట్టింది. దీంతో వర్క్ ఫ్రం హోం చేయాలా ..లేక ఆఫీసులకు వెళ్లాలా అని టెకీలు ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది.
ప్రముఖ ల్యాప్ టాప్ బ్రాండ్ డెల్.. వర్క్ ఫ్రం హోం ఉద్యోగుల ప్రమోషన్లపై కీలక ప్రకటన చేసింది. ఒక మెమోలో ఇంటినుంచి ఉద్యోగం చేసుకోవచ్చు అంటూనే..రిమోట్ ఉద్యోగుతు ప్రమోషన్ల కోసం పరిగణింపబడరు అని తిరకాసు పెట్టింది. డెల్ కోవిడ్ దెబ్బకు గత కొన్నేళ్లుగా వర్క్ ఫ్రం హోం ను ప్రోత్సహిస్తోంది. అయితే ఇటీవల కంపెనీ రిటర్న టు ఆఫీస్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది.. అయినా ఉద్యోగులు ఆఫీసులకు వచ్చి పనిచేసేందుకు ఇష్ట పడకపోవడంతో.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.. మరి టెకీలు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.