- డెలాయిట్ అంచనా
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మనదేశ జీడీపీ గ్రోత్6.5–6.8 శాతం వరకు ఉండొచ్చని డెలాయిట్ఇండియా అంచనా వేసింది. ఎకానమీని మరింత బలోపేతం చేయడానికి కేంద్రం తన బలాలన్నింటినీ వాడాలని ఎకనమిక్ఔట్లుక్రిపోర్ట్లో సూచించింది.
దీని ప్రకారం.. దేశవిదేశీ మార్కెట్లలో సవాళ్లు ఉన్నప్పటికీ ఇండియా గ్లోబల్వాల్యూ చెయిన్లలో ముందుకు సాగుతోంది. అందుకే మాన్యుఫాక్చరింగ్ఎగుమతులు పెరుగుతున్నాయి. ఎలక్ట్రానిక్స్, మెషీనరీ, ఎక్విప్మెంట్ఎగుమతులు బాగున్నాయి.
గత అక్టోబరులో విడుదలైన ఔట్లుక్ రిపోర్ట్ మన జీడీపీ గ్రోత్ 7–7.2 శాతం మధ్య ఉంటుందని ఈ సంస్థ అంచనా వేయగా, ఈసారి దానిని తగ్గించింది. ఎన్ఎస్ఓ అంచనాల ప్రకారం ఈసారి జీడీపీ నాలుగేళ్ల కనిష్టం 6.4 శాతానికి పడిపోతుంది. ఆర్బీఐ మాత్రం ఇది 6.6 శాతం వరకు ఉంటుందని భావిస్తోంది.