అమెజాన్ వెబ్ సర్వీసెస్తో డెలాయిట్ జోడీ

అమెజాన్ వెబ్ సర్వీసెస్తో డెలాయిట్ జోడీ

హైదరాబాద్​, వెలుగు:  మనదేశంలోని వ్యాపార సంస్థల్లో సరికొత్త మార్పులు తీసుకురావడానికి  కన్సల్టింగ్ సంస్థ డెలాయిట్ ఇండియా, సాఫ్ట్‌‌‌‌వేర్ కంపెనీ అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్)తో కలసి నియర్ ‘జీరో కాస్ట్ మైగ్రేషన్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీంతో ఇండియా కస్టమర్లు వారి ప్రస్తుత వ్యాపార వ్యవస్థలను అత్యాధునిక టెక్నాలజీలతో కూడిన కొత్త సిస్టమ్‌‌‌‌లకు మారడానికి సహాయం చేస్తారు. 

సాధారణంగా, పాత సిస్టమ్‌‌‌‌ల నుంచి కొత్త సిస్టమ్‌‌‌‌లకు మారడం చాలా ఖర్చుతో కూడుకున్న పని.  డెలాయిట్ ఇండియా,  ఏడబ్ల్యూఎస్ కలిసి రూపొందించిన ఈ ప్రత్యేకమైన ప్రోగ్రామ్ ద్వారా, భారతీయ కంపెనీలు  దాదాపు ఎటువంటి ఖర్చు లేకుండా లేదా చాలా తక్కువ ఖర్చుతో పూర్తి చేయవచ్చు.  ఎస్​ఏపీ అత్యాధునిక ఎంటర్‌‌‌‌ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ (ఈఆర్​పీ) సాఫ్ట్‌‌‌‌వేర్,  ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ కలయికతో కంపెనీలు తమ డేటాను మరింత సమర్థవంతంగా వాడుకోవచ్చు. ఆపరేషన్స్​ను మరింత బాగా నిర్వహించవచ్చు.