ఏపీలో కొత్త ఏడాది జోష్ కనిపిస్తోంది. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ హడావుడితో పాటు వైన్ షాప్స్ దగ్గర మద్యం ప్రియుల సందడి కూడా మొదలైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త బ్రాండ్లను అందుబాటులోకి తేవటమే కాకుండా రూ. 99కే నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తేవడంతో మద్యం ప్రియులు రెట్టించిన ఉత్సాహంతో మద్యం కొంటున్నారు. రికార్డు స్థాయిలో అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఎన్నికల్లో చెప్పినట్టుగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ 99 కే మద్యం అందుబాటులోకి తేవడంతో ఇప్పుడు ఈ బ్రాండ్ల హవా కొనసాగుతోంది. 25 శాతం అమ్మకాలు ఈ బ్రాండ్ల నుంచే ఉన్నట్లు తెలుస్తోంది.
మద్యం అమ్మకాల్లో రూ.99కే బ్రాండ్ కే డిమాండ్ పెరిగిందని... మొత్తం అమ్మకాల్లో సుమారు 25 శాతం మేర ఈ బ్రాండ్ మద్యం అమ్మకాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీలో 99 రూపాయల మద్యానికి డిమాండ్ పెరుగుతున్న క్రమంలో ఇతర కంపెనీలు కూడా ఈ రకం మద్యం తయారీకి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. తక్కువ ధర బ్రాండ్ల మద్యం అమ్మకాలు పెరగటంతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గుతున్నట్లు ఎక్సైజ్ తెలిపింది.
ALSO READ | Rain Alert: అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టనున్న వర్షాలు
రానున్న రోజుల్లో 99 రూపాయల మద్యం అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు. ఇతర కంపెనీలు కూడా ఈ రకం మద్యం తయారీకి సన్నాహాలు చేస్తున్న క్రమంలో డిమాండ్ కి తగిన రేంజ్ లో సరఫరా ఉంటుందని అంటున్నారు అధికారులు.