ఈ- బైక్ బెటర్... సిటీలో పెరుగుతోన్న డిమాండ్.. కొనుగోలుకు సిటిజన్ల ఆసక్తి

ఈ- బైక్ బెటర్... సిటీలో పెరుగుతోన్న డిమాండ్.. కొనుగోలుకు సిటిజన్ల ఆసక్తి
  • 60 శాతం మందియూత్ ఇంట్రెస్ట్ 
  • సిటీకి చెందిన బిట్స్​ పిలానీ కాలేజీ సర్వేలో వెల్లడి

సికింద్రాబాద్​, వెలుగు : సిటీలో ఈ– బైక్ లకు డిమాండ్ పెరుగుతోంది. పెట్రోల్​రేట్లు భరించలేక.. చాలామంది ఈ– -బైక్ లపై ఆసక్తి చూపుతున్నట్టు..ఇంధన ఖర్చులు కూడా ఆదా అవుతుండగా ఎక్కువగా కొనుగోలు చేస్తున్న ట్టు వెల్లడైంది. ముఖ్యంగా యూత్ ఎక్కువగా ఈ– బైక్ లకు ప్రయార్టీ ఇస్తున్నట్టు ఓ సర్వేతో తేలింది. ఈ– -బైక్​లు, ఎలక్ర్టిక్ బ్యాటరీ కార్ల అమ్మకాలపై సిటీకి చెందిన బిట్స్​పిలానీ కాలేజీ, ఆస్ట్రేలియాలోని లా ట్రోబ్ యూనివర్సిటీ విద్యార్థులు కొద్దిరోజుల కిందట సంయుక్తంగా స్టడీ చేశారు.

సిటీలో ప్రధాన కూడళ్లు, మెట్రో స్టేషన్లలో నిర్వహించారు. పలు ప్రాంతాల్లోని వాహనదారులను సంప్రదించి అభిప్రాయాలను సేకరించా రు.  పెట్రోల్ ధరలు,  ట్రాఫిక్ రద్దీ, హెల్త్, పర్యావరణ వంటి ప్రయోజనాల దృష్ట్యా ఈ- – బైక్​లను వాడేందుకు ఇష్టపడుతున్నట్లు పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తంచేశారు. 60 శాతం మంది ఈ– బైక్ ను ఇష్టపడుతున్నట్లు స్టడీ ద్వారా గుర్తించారు. 

 ఫీడర్ వాహనాలుగా..

ప్రధానంగా బేగంపేట, హైటెక్ సిటీ, నాగోల్, రాయదుర్గంలోని మెట్రో స్టేషన్లలో, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ లో ఐటీ కంపెనీల్లో సర్వే చేశారు. ఇందులో మొత్తం 482 మంది సిటిజన్ల అభిప్రాయాలు సేకరించారు.  మెట్రో స్టాప్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం ఎక్కువ మంది మహిళా ప్రయాణికులు ఈ–బైక్ ను 'ఫీడర్' వాహనాలుగా ఇష్టపడుతున్నట్లు.. దూరప్రాంతాలకు వెళ్లే ఉద్యోగినులు,  కాలేజీలకు వెళ్లే యువతులు మెట్రో కనెక్టివిటీ కోసం ఈ – -బైక్​లను వాడుతున్నట్టు స్టడీలో గుర్తించారు. 10 కి.మీ కంటే తక్కువ దూరం వరకు వినియోగిస్తున్నట్టు, చాలా సౌకర్యవంతంగా ఉంటున్నాయని, అందుకే  యువకులు ఇష్టపడుతున్నట్టు  సర్వేలో స్పష్టంచేశారు.  

చార్జింగ్.. సైక్లింగ్​పాయింట్ల కొరత

సిటీలో చాలా మంది ఈ – -బైక్​లను వాడేందుకు ఇంట్రెస్ట్ చూపుతుండగా.. చార్జింగ్​పాయింట్లు, సైక్లింగ్​పాత్​ల కొరత ఉంది. కొన్ని చోట్ల మాత్రమే చార్జింగ్​పాయింట్లు అందుబాటులో ఉన్నాయి.  దీంతో ఈ – -బైక్​లు  చార్జింగ్ చేసుకోవాలంటే కనీసం 5 – 10 కి.మీ దూరం వెళ్లి చార్జింగ్​ చేసుకోవాల్సి వస్తుంది. 

సైక్లింగ్ పాత్​లు సరిపోకపోవడం, చార్జింగ్ మౌలిక సదుపాయాలతో సహా అనేక ఇబ్బందులు ఉన్నాయని సర్వేలో గుర్తించారు. చార్జింగ్​ పాయింట్ల సంఖ్య మరింతగా పెంచితే ఈ – -బైక్​ల  వాడకం ఎక్కువయ్యే అవకాశాలున్నట్లు రిసెర్చర్స్  పేర్కొంటున్నారు. చార్జింగ్​ పాయింట్ల కొరత  తీవ్రంగా ఉండగా.. అక్కడ వాహనదారుల రద్దీ కూడా ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.

చాలా సౌకర్యంగా ఉంది

పెట్రోల్​బైక్​వాడుతుండగా ప్రతినెలా ఖర్చు ఎక్కువ అయ్యేది. దీంతో  రెండు నెలల కిందట ఈ బైక్ కొన్నాను. దీంతో  ఖర్చులు చాలా తగ్గాయి. ఈ –-బైక్​పై వెళ్తుండగా చాలా  సౌకర్యంగా ఉంది.  ఒక్కసారి చార్జింగ్ చేస్తే 120 కిలోమీటర్ల వరకు నడుస్తుంది. 

 – ప్రవీణ్, సికింద్రాబాద్​ 

ఒక్కటే ఉండగా.. వీకెండ్ లో రద్దీ  

హబ్సిగూడ రోడ్డులో నాలుగు నెలల కిందట ఏర్పాటైన చార్జింగ్ సెంటర్​కు ప్రతి రోజు50 నుంచి 100 బైక్​లు వస్తుంటాయి.  చాలామంది వచ్చి తమ వెహికల్స్ కు రాత్రిపూట చార్జింగ్ పెట్టి  ఉదయం తీసుకెళ్తుంటారు. ఉప్పల్​నుంచి సికింద్రాబాద్ వరకు ఈ – -బైక్​చార్జింగ్ సెంటర్లు లేవు.  హబ్సిగూడలో ఒక్క సెంటర్​ఉండగా.. వీకెండ్ లో చాలా రద్దీగా ఉంటుంది. 

– నర్సింగరావు,సెక్యూరిటీ, హబ్సీగూడ ఈ– చార్జింగ్ సెంటర్