గోల్డ్ కార్డులకుమస్త్ గిరాకీ ..ఒక్కరోజులోనే 1,000 కార్డులు సేల్

గోల్డ్ కార్డులకుమస్త్ గిరాకీ ..ఒక్కరోజులోనే 1,000 కార్డులు సేల్

వాషింగ్టన్: ప్రపంచ దేశాల సంపన్నులు తమ దేశంలో భారీగా పెట్టుబడులు పెట్టి సెటిల్ అయ్యేందుకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన గోల్డ్ కార్డ్ స్కీంకు మస్త్ గిరాకీ ఏర్పడింది. ఒక్కరోజులోనే 1000 గోల్డ్ కార్డులను విక్రయించామని ఈ మేరకు యూఎస్ కామర్స్ మినిస్టర్ హోవార్డ్ లుట్నిక్ ప్రకటించారు. శనివారం ‘ఆల్-ఇన్ పాడ్ కాస్ట్’లో ఆయన మాట్లాడారు. 

ఒక్కో కార్డుకు 50 లక్షల డాలర్ల (రూ. 43 కోట్లు) చొప్పున మొత్తం 500 కోట్ల డాలర్ల(రూ. 43 వేల కోట్లు) ఆదాయం సమకూరిందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో అమెరికా గోల్డ్ కార్డులను కొనుగోలు చేసే కెపాసిటీ ఉన్నవాళ్లు దాదాపు 3.7 కోట్ల మంది ఉన్నారని, వీరిలో 10 లక్షల మందికి కార్డులను అమ్మినా కనీసం 5 లక్షల కోట్ల డాలర్లు సేకరించవచ్చని ట్రంప్ భావిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం అమెరికా ఫెడరల్ గవర్నమెంట్ అప్పులు 36 లక్షల కోట్ల డాలర్ల(రూ.30 కోట్ల కోట్లు)కు చేరాయని, గోల్డ్ కార్డుల ద్వారా సేకరించే నిధులను సర్దుబాటు చేయడం ద్వారా అప్పులను కొంతమేరకు తగ్గించాలని యోచిస్తున్నామని ఆయన చెప్పారు.