ఇండ్ల డిమాండ్ పెరుగుతుంది.. తగ్గదు: క్రెడాయ్‌‌‌‌

ఇండ్ల డిమాండ్ పెరుగుతుంది.. తగ్గదు:  క్రెడాయ్‌‌‌‌

న్యూఢిల్లీ: తాజా బడ్జెట్‌‌‌‌లో ట్యాక్స్ రాయితీలు ప్రకటించడంతో పాటు, ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించడంతో  ఇండ్లకు డిమాండ్ కొనసాగుతుందని క్రెడాయ్‌‌‌‌ ప్రెసిడెంట్ బోమన్ ఇరాని అన్నారు. ఇండియా హౌసింగ్ మార్కెట్‌‌‌‌లో డిమాండ్ తగ్గుతున్నట్టు సంకేతాలేవి కనిపించడం లేదని, బదులుగా లాంగ్‌‌‌‌ టెర్మ్‌‌‌‌లో మరింత పెరుగుతుందని అంచనా వేశారు. 

కానీ,  కొన్ని ఏరియాల్లో  డిమాండ్‌‌‌‌ తగ్గే అవకాశాలు లేకపోలేదని అన్నారు. ముంబై మెట్రోపాలిటన్ ఏరియాలో ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ల డేటాను ఆయన బయటపెట్టారు. సుమారు 12 వేల యూనిట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయని, డిమాండ్ గ్రోత్ ఫ్లాట్‌‌‌‌గా ఉందని అన్నారు.

మరిన్ని వార్తలు