
- 25న 16,506 మెగావాట్లతో సరికొత్త రికార్డు నమోదు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరెంటు వినియోగం భారీగా పెరుగుతోంది. గత రికార్డులను తిరగరాస్తూ మంగళవారం ఉదయం 8.30 గంటలకు16,506 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. ఫిబ్రవరి 21న రాష్ట్ర చరిత్రలో అత్యధికంగా 16,412 మెగావాట్ల డిమాండ్ నమోదు కాగా మంగళవారం దీన్ని అధిగమించింది. విద్యుత్ వాడకంలోను సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ఈ సారి సాగు విస్తీర్ణం పెరగడంతో అగ్రికల్చర్ సెక్టార్ కు పెద్ద ఎత్తున కరెంటు అవసరమవుతోంది.
మరోవైపు ఎండ తీవ్రత పెరుగుతుండటంతో ఫ్యాన్లు, ఏసీల వినియోగం కారణంగా గృహ, కమర్షియల్, ఇండస్ట్రీ రంగాలు కరెంటును ఎక్కువగా వాడుతున్నాయి. దీంతో రెండు వారాలుగా రోజువారీగా 300 మిలియన్ యూనిట్లకు పైగా కరెంటును ఉపయోగిస్తున్నారు. ఫిబ్రవరి 21న 313.36 ఎంయూల కరెంటును వాడగా, తాజాగా మంగళవారం 313.373 ఎంయూల కరెంటును వాడారు.