- 21వ తేదీ వరకు గడువు అడిగిన మేనేజ్మెంట్
గోదావరిఖని, వెలుగు : పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్ కేశోరాం సిమెంట్ ఫ్యాక్టరీలో కాంట్రాక్టు కార్మికుల బేసిక్స్, రేట్ల పెంపుదల విషయమై మంగళవారం యూనియన్ అధ్యక్షుడు సూర సమ్మయ్య ఆధ్వర్యంలో గేటు ఎదుట ధర్నా నిర్వహించారు. సమ్మయ్య మాట్లాడుతూ ఫ్యాక్టరీ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో బేసిక్స్, రేట్స్, అన్ స్కిల్డ్ , సెమీ స్కిల్డ్వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా ప్లాంట్ హెడ్, హెచ్ ఆర్ అధికారులకు కార్మికుల డిమాండ్లను తెలుపగా వారు ఒప్పుకోలేదు.
దీంతో ఆందోళన పెరిగి కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న పెద్దపల్లి సీఐ అనిల్, బసంత్ నగర్ ఎస్ఐ, సిబ్బందిని మోహరించారు. ఫ్యాక్టరీ హెచ్‌ఆర్ ఆఫీసర్ గోవిందరావు తమకు 21వ తేదీ వరకు సమయం కావాలని కోరడంతో కార్మికులు, నాయకులు ధర్నా విరమించారు. ఆందోళనలో యూనియన్ ప్రధాన కార్యదర్శి కాల్వ అంజయ్య, నాయకులు పాత రవీందర్, గంగాధరి రమేశ్పాల్గొన్నారు.