పార్ట్ టైం లెక్చరర్ల జీతాలు పెంచాలి

పార్ట్ టైం లెక్చరర్ల జీతాలు పెంచాలి

ఓయూ, వెలుగు: పార్ట్ టైం లెక్చరర్లకు జీతాలు పెంచాలని తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓయూలో సోమవారం నిరసన వ్యక్తం చేశారు. అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రం నాగేంద్రం, కార్యవర్గ సభ్యుడు బి.శ్రీనివాస్ మాట్లాడుతూ.. జీతాలు సరిపోక రాష్ట్రంలోని 13 వర్సిటీల్లోని 800కు పైగా పార్ట్ టైం లెక్చరర్లు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. 

ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు తమ జీతాలను రూ.50 వేలకు పెంచాలని కోరారు.  అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మరపాల కుమారస్వామి, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీలక్ష్మిరెడ్డి, మంచాల లింగస్వామి, అల్లం ఏడు కొండలు తదితరులు పాల్గొన్నారు.