ఉద్యోగుల బదిలీలు చేపట్టండి

ఉద్యోగుల బదిలీలు చేపట్టండి

తెలంగాణా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలు జరిగి ఆరు సంవత్సరాలు పూర్తయ్యాయి. కళాశాల విద్యాశాఖలో కూడా అధ్యాపకుల బదిలీలు లేక ఆరు సంవత్సరాలు దాటింది. మారుమూల ప్రాంతములో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న ఉద్యోగులు కుటుంబాలకు దూరంగా ఉంటూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.  దీనివల్ల పనిపట్ల విసుగు కలిగి పనితీరుపై  వ్యతిరేక ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఎన్నికల కోడ్ జూన్ మొదటి వారం వరకు ఉండడం, జూన్ 12 నుంచి పాఠశాలల పునఃప్రారంభం దృష్ట్యా ఉద్యోగుల పిల్లల చదువులకు ఆటంకం పేరుతో ఈ సంవత్సరం  కూడా సాధారణ బదిలీలు జరగవేమోననే ఆందోళనలో ఉద్యోగులు ఉన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని ఎన్నికల సంఘం అనుమతితో సాధారణ బదిలీలను మే నెలలోనే నిర్వహించి, జూన్ మొదటి వారంలో ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే బదిలీ ఉత్తర్వులను ఇచ్చి ఉద్యోగులను విడుదల చేయాలి.

- ఎ.వి.రమణ,హన్మకొండ