- నెలరోజులకు చేరిన సమ్మె
చండూరు, వెలుగు : గ్రామపంచాయతీలో మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని తమ డిమాండ్లను నెరవేర్చాలని గట్టుపల, చండూరు మండలాల్లో గ్రామ పంచాయతీ కార్మికులు గురువారం ఆందోళన చేశారు. బంగారుగడ్డ గ్రామంలో రోడ్లపై టెంట్లు వేసి వంటా వార్పు నిర్వహించి, నిరసన చేపట్టారు. కులవివక్ష పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షుడు బొట్టు శివకుమార్ సంఘీభావం తెలిపారు. పంచాయతీ కార్మికులు 29 రోజులుగా నిరసన చేపట్టిన ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు.
వెంటనే స్పందించి వారి డిమాండ్లను నెరవేర్చాలని లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమ్మెలో కన్వీనర్ మోగదాల వెంకటేశ్, అధ్యక్ష కార్యదర్శులు ఏర్పుల సైదులు, నాంపల్లి శంకరయ్య, బొమ్మర బోయిన పుష్పలత, బరిగెల దాసు, కిన్నెరఅబ్బయ్య, బొట్ట చంద్రయ్య, వెంకన్న పాల్గొన్నారు.
మునుగోడు(నాంపల్లి) : నాంపల్లి మండలం కేంద్రంలో ఏంపీడీఓ ఆఫీఎస్ ఎదుట కార్మికులు సమ్మె కొనసాగించారు. నెల రోజుల నుంచి సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వారికి జనసేన నాంపల్లి మండలం అధ్యక్షుడు కురుపాటి, శ్రీను, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి గుండెబోయిన సంఘీభావం ప్రకటించారు.
నార్కట్‌పల్లి : సమ్మె చేస్తున్న కార్మికుల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి వీడి, వారి సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జయలక్ష్మీ, తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చస్త్రశారు. గురువారం తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ నకిరేకల్ నియోజకవర్గస్థాయి కార్మిక శిక్షణ తరగతులు నార్కెట్‌పల్లిలోని రేణుక ఎల్లమ్మ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ని కార్మికులకు వెంటనే కనీస వేతనం రూ. 19 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి నారబోయిన శ్రీనివాస్, రైతు సంఘం జిల్లా నాయకులు, వెంకటేశ్వర్లు, వైస్ ఎంపీపీ కల్లూరు యాదగిరి, మత్స్య కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు నరసింహ పాల్గొన్నారు.