లెటర్​ టు ఎడిటర్​: ట్రాఫిక్ సిగ్నల్స్ పెంచాలి

లెటర్​ టు ఎడిటర్​: ట్రాఫిక్  సిగ్నల్స్ పెంచాలి

ప్రపంచవ్యాప్తంగా భారతదేశం 145 కోట్ల మందికిపైగా జనాభాతో  మొదటి స్థానంలో ఉంది.  గణనీయంగా జనాభా పెరుగుతున్న నిష్పత్తిలో తమ అవసరాల నిమిత్తం ప్రజల ప్రయాణ సాధనాలుగా వాహనాల సంఖ్య కూడా  పెరుగుతోంది.  విద్య, వైద్యం తదితర పనుల నిమిత్తం ప్రజలు గ్రామాలు, మండల కేంద్రాలు,  జిల్లా కేంద్రాలు నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్​కు వివిధ రకాలైన వ్యక్తిగత,  ప్రభుత్వ వాహనాల్లో వస్తున్నారు. ఈనేపథ్యంలో ట్రాఫిక్​ సమస్యల కారణంగా తమ వాహనాలు నిలిచిపోవడంతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. 

 హైదరాబాద్​ చుట్టుపక్కల నుంచి వచ్చే ప్రజల సౌకర్యార్థం  ఆసుపత్రులు తదితర ప్రాంతాలలో ప్రస్తుతం ఉన్నవాటికి అదనంగా ట్రాఫిక్ సిగ్నల్స్ సంఖ్య పెంచాలి.  దీంతో వారు ట్రాఫిక్​ సమస్య నుంచి బయటపడి త్వరతగతిన తమ పనులు పూర్తి చేసుకుంటారు. అదేవిధంగా హైదరాబాద్ వాసులు ఎక్కువగా సందర్శించే  దేవాలయాలు, విద్యాసంస్థలు, మార్కెట్లు,  ప్రభుత్వ కార్యాలయాలు, బస్టాండ్,  రైల్వే స్టేషన్ వంటి ప్రాంతాలు,  ప్రజలు ఎక్కువగా ఉండే జంక్షన్ లాంటి ప్రాంతాలను గుర్తించి  ట్రాఫిక్ సిగ్నల్స్ అమర్చితే ట్రాఫిక్​ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.  ట్రాఫిక్​ స్తంభించిపోకుండా సజావుగా వాహనాల రవాణా జరిగేలా ట్రాఫిక్ పోలీస్ లను నియ మించాలి.  ట్రాఫిక్ నిబంధనలను ప్రతి వ్యక్తి పాటించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలి. వాహన  ప్రమాదాల నివారణకు ప్రభుత్వం కృషి చేయాలని కోరుతున్నాం.   


సత్తె పూసలు.. సల్ల గురుగులు
డా.ఈదునూరి వెంకటేశ్వర్లు,
 నెక్కొండ