ప్రార్థనల కోసం చార్మినార్‌ను తెరిచేందుకు అనుమతివ్వాలి

ప్రార్థనల కోసం చార్మినార్‌ను తెరిచేందుకు అనుమతివ్వాలి
  • చార్మినార్ ను ప్రార్థనల కోసం తెరవాలని కాంగ్రెస్ నేత డిమాండ్
  • సంతకాల సేకరణ చేపట్టిన రషీద్ ఖాన్
  • మతపరమైన ఉద్రిక్తత సృష్టించేందుకేనన్న బీజేపీ నాయకుడు
  • రషీద్ ను అరెస్టు చేయాలని రామ్‌చందర్‌రావు డిమాండ్

హైదరాబాద్‌లోని చార్మినార్‌ను  ప్రార్థనల కోసం తెరిచేందుకు అనుమతించాలంటూ ఓ కాంగ్రెస్ నేత నిరసన దీక్షకు దీక్షకు దిగడంతో తెలంగాణలో కొత్త వివాదం రాజుకుంది. చార్మినార్‌లో గతంలో ప్రార్థనలు జరిగేవని, అయితే రెండు దశాబ్దాల క్రితం ఆ ప్రదేశంలో ప్రార్థనలు చేయకుండా ముస్లింలను నిషేధించారని కాంగ్రెస్ స్థానిక నాయకుడు రషీద్ ఖాన్ తెలిపారు. కాగా తాజాగా మళ్లీ ప్రార్థనల కోసం చార్మినార్ ను పునఃప్రారంభించాలని పర్యాటక మరియు సాంస్కృతిక మంత్రిత్వ శాఖను అభ్యర్థిస్తూ.. ఖాన్ సంతకాల ప్రచారాన్ని చేపట్టారు. 

ప్రగతి భవన్‌ వద్ద ఆందోళన చేస్తాం

“మేము సాంస్కృతిక మంత్రిత్వ శాఖతో మాట్లాడినప్పుడు, శాంతి భద్రతల సమస్య ఉంటుందని కిషన్ రెడ్డి చెప్పారు. అందరి సంతకాలు తీసుకుని సీఎం వద్దకు వెళతాను. మా వినతులు పరిష్కరించకుంటే ప్రగతి భవన్‌ వద్ద ఆందోళన చేస్తాం. మసీదులపై దేశవ్యాప్తంగా తప్పుడు వాగ్దానాలు చేస్తున్నారు'.
-రషీద్ ఖాన్, కాంగ్రెస్ నేత

మతపరమైన ఉద్రిక్తత సృష్టించేందుకే...

కాంగ్రెస్ నాయకుడి చేపట్టిన ఈ సంతకాల సేకరణపై బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామ్‌చందర్‌రావు తీవ్రంగా ప్రతిస్పందించారు. హైదరాబాద్‌లో మతపరమైన ఉద్రిక్తత సృష్టించేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందని అన్నారు. నగరంలో కాంగ్రెస్ పార్టీ పతనమైందన్న ఆయన... రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మతపరమైన సమస్యలను లేవనెత్తడం ద్వారా వారు రాష్ట్రంలో పట్టు సాధించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చార్మినార్ ఒక వారసత్వ కట్టడమని, అనేక సంవత్సరాలుగా ప్రజలు పూజలు చేస్తున్న ఆలయం ఇక్కడ ఉంది”అని రావు చెప్పారు. ఈ రెండు సమస్యలను (చార్మినార్ సమీపంలోని దేవాలయం, మసీదు) అనుసంధానం చేయడం వల్ల నగరంలో "మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టే" ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.“రాష్ట్ర ప్రభుత్వం శాంతిభద్రతలను కాపాడటానికి ముందడుగు వేయాలని అన్నారు. దాంతో పాటు నగరంలో మతపరమైన సమస్యలను సృష్టించినందుకు గానూ అతన్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు తమ ప్రయోజనాల కోసం మైనార్టీల మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని ఈ సందర్భంగా రామ్‌చందర్‌రావు ఆరోపించారు.

 

మరిన్ని వార్తల కోసం..

వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర  రూ.135 తగ్గింపు

గాంధీ ఫ్యామిలీపై స్మృతీ ఇరానీ ఫైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌