అంగన్‌‌‌‌‌‌‌‌వాడీల సమస్యలు పరిష్కరించాలి

హనుమకొండ సిటీ/మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌ అర్బన్‌‌‌‌‌‌‌‌, వెలుగు : ఐసీడీఎస్‌‌‌‌‌‌‌‌కు బడ్జెట్‌‌‌‌‌‌‌‌ను పెంచడంతో పాటు, అంగన్‌‌‌‌‌‌‌‌వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేస్తూ అంగన్‌‌‌‌‌‌‌‌వాడీ టీచర్లు సోమవారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా హసన్‌‌‌‌‌‌‌‌పర్తి నుంచి హనుమకొండ కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌ వరకు 10 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాగుల రమేశ్‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ 2020 నూతన విద్యా చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. అంగన్‌‌‌‌‌‌‌‌వాడీ ఉద్యోగులకు రూ. 26 వేల కనీస వేతనం, పెన్షన్, ఈఎస్‌‌‌‌‌‌‌‌ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలనికోరారు.

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్‌‌‌‌‌‌‌‌వాడీ టీచర్లకు గ్రాట్యుటీ చెల్లించాలని, 4 లేబర్ కోడ్‌‌‌‌‌‌‌‌లను రద్దు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎన్.శోభారాణి, కె.రమాదేవి, పూజారి రమాదేవి, పి.శోభారాణి, యు.రాజేశ్వరి పాల్గొన్నారు. అలాగే మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌లో ఎన్‌‌‌‌‌‌‌‌టీఆర్‌‌‌‌‌‌‌‌ స్టేడియం నుంచి ర్యాలీ నిర్వహించిన అనంతరం ధర్నా చౌక్ వద్ద మీటింగ్‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకుల రాజు, కుంట ఉపేందర్‌‌‌‌‌‌‌‌, యూనియన్‌‌‌‌‌‌‌‌ లీడర్లు సరోజ, తిరుపతమ్మ, రఫియా, జ్యోతి, లలిత పాల్గొన్నారు.