కామారెడ్డి టౌన్, వెలుగు: ఔట్సోర్సింగ్ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి కామారెడ్డి కలెక్టరేట్ఎ దుట సోమవారం నిరసన తెలిపారు. కొన్నేళ్లుగా పని చేస్తున్న తమను రెగ్యులరైజ్చేయాలని, ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని, చనిపోయిన ఔట్సోర్సింగ్ఎంప్లాయిస్ కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థికసాయం చేయాలని డిమాండ్ చేశారు.
జేఏసీ ప్రతినిధులు అరుణ్, మహ్మద్, అనిల్, రాజేందర్, నిఖిల్ పాల్గొన్నారు.