జూలూరుపాడు/ములకలపల్లి, వెలుగు: పంటలకు గిట్టుబాటు ధరల చట్టం తీసుకురావాలని కోరుతూ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మంగళవారం జూలూరుపాడులో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మోర్చా నాయకులు మాట్లాడుతూ.. గిట్టుబాటు ధర చట్టం చేయాలని, విద్యుత్ సవరణ బిల్లును తక్షణమే ఉపసహరించుకోవాలని కోరారు. రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలన్నారు.
సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు చింత స్వరాజ్ రావు, వల్లమల చందర్రావు, ఏదులాపురం గోపాలరావు, యలంకి మధు తదితరులు పాల్గొన్నారు. ములకలపల్లిలోని బస్టాండ్ సెంటర్లో రైతు సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. మద్దతు ధరల చట్టం చేయాలని, రైతులకు ఇచ్చిన లిఖితపూర్వక వాగ్దాలను అమలు చేయాలని కోరారు. నాయకులు ముదిగొండ రాంబాబు, పోతుగంటి లక్ష్మణ్, వూకంటి రవి, నకరకంటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.