వేములవాడ, వెలుగు: దళితులను బీఆర్ఎస్ సర్కార్ మోసం చేసిందని బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు సంటి మహేశ్ ఆరోపించారు. మంగళవారం వేములవాడలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ లీడర్లు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్చేశారు.
కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు సంతోష్ బాబు, లీడర్లు కృష్ణ, శ్రీనివాస్, వివేక్ రెడ్డి, హనుమండ్లు, శ్రీనివాస్, రాజ్కుమార్పాల్గొన్నారు.