
ఆత్మకూరు (దామెర), వెలుగు : వచ్చే ఎన్నికల్లో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి టికెట్ ఇవ్వొద్దంటూ హనుమకొండ జిల్లా దామెర మండలం పసరగొండలో శుక్రవారం ఉద్యమకారులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఉద్యమకారులకు సపోర్ట్ చేస్తే దళితబంధు ఇవ్వబోమని బెదిరిస్తున్నారని, దళితులను అణచి వేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
ఉద్యమంలో చురుగ్గా పనిచేసిన గజ్జి విష్ణును పార్టీ నుంచి తొలగించే హక్కు ఆయనకు ఎక్కడిదని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో పరకాల టికెట్ ఉద్యమకారులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గజ్జి సైలాన్, నర్సింగరావు పాల్గొన్నారు.