అకాల వర్షాలతో వడ్లు తడిసిపోవడంతో రైతులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు తెలుపుతున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని ఎక్లాస్ పూర్ ఆటో స్టాండ్ వద్ద మంథని కాటారం ప్రధాన రహదారి పై రైతులు రాస్తారోకో చేపట్టారు.
నిలిచిన వాహనాలు
అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో తడిసిన, మొలకెత్తిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో స్పష్టత వచ్చే వరకు నిరసనలు విరమించేది లేదని స్పష్టం చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ధర్నాను విరమించాలని కోరినా కర్షకులు వినలేదు. రాస్తారోకోతో రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.