- పరిశీలించిన ఐటీడీఏ పీవో ప్రతీక్‌జైన్
భద్రాచలం, వెలుగు : భద్రాచలంలోని ట్రైబల్ బీఎడ్ కాలేజీలో పనిచేస్తున్న గెస్ట్, కాంట్రాక్టు లెక్చరర్ల అకాడమిక్ ఇయర్ పర్ఫార్మెన్స్ ను డెమో క్లాసుల ద్వారా ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్ పరిశీలించారు. వారిని కొనసాగించాలా లేదా అన్నది నిర్ణయించేందుకు శుక్రవారం సబ్జెక్టులవారీగా రివ్యూ చేశారు. కమిటీ సభ్యులు డీడీ ట్రైబల్ వెల్ఫేర్ మణెమ్మ, డీఈవో వెంకటేశ్వరాచారి, బీఎడ్ కాలేజీ ప్రిన్సిపల్ వీరూనాయక్, డైట్ కాలేజీ ప్రిన్సిపల్ భవానీ, ఏసీఎంవో రమణయ్య, ఏటీడబ్ల్యూవో నర్సింహారావు, ఇతర లెక్చరర్లు డెమో క్లాసులు పరిశీలించారు.