ట్రంప్​పై కమలా హారిస్​ ఆధిక్యం

ట్రంప్​పై కమలా హారిస్​ ఆధిక్యం
  • ఎన్నికల ప్రచారంలో, ఫండ్​ రైసింగ్​లో దూకుడు

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల  ప్రచారంలో డెమొక్రటిక్​ క్యాండిడేట్​ కమలా హారిస్​ దూసుకుపోతున్నారు. నవంబర్​ 5న జరిగే జనరల్​ ఎలక్షన్స్​లో రిపబ్లికన్​ క్యాండిడేట్​ డొనాల్డ్​ ట్రంప్​ను ఓడించి తీరుతామని, విజయం తమదేనని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి జో బైడెన్​ తప్పుకొని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్​ను అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి ఆమె ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కమల చేపడ్తున్న ఫండ్​ రైసింగ్​ క్యాంపెయిన్​కు జనం నుంచి భారీ స్పందన వస్తున్నది.

శాన్​ఫ్రాన్సిస్కోలో ఆదివారం జరిగిన ఫండ్​ రైసింగ్​ సభలో ఆమె మాట్లాడుతూ.. ‘‘ఈసారి కూడా మనదే గెలుపు” అని అన్నారు. ఈ సభలో 12 మిలియన్ల డాలర్ల విరాళాలు వచ్చాయి. 700 మంది దాతలు, పలువురు ప్రముఖ ఇండియన్​ అమెరికన్స్​ పాల్గొన్నారు. అధ్యక్ష అభ్యర్థిగా తెరమీదికి వచ్చి ఇంకా నెలరోజులు కూడా కాకముందే ఆమె ట్రంప్​పై ఆధిపత్యం కనబరుస్తున్నారు. కాగా.. విస్కాన్సిన్‌‌‌‌, పెన్సిల్వేనియా, మిషిగాన్‌‌‌‌ రాష్ట్రాల్లో ఇటీవల న్యూయార్క్‌‌‌‌ టైమ్స్‌‌‌‌, సియానా కాలేజ్‌‌‌‌ సంయుక్తంగా నిర్వహించిన పోల్‌‌‌‌ సర్వేలో ట్రంప్ కంటే కమలా హారిస్​ 4% మేర ఆధిక్యంలో ఉన్నట్లు తేలింది.