నిజామాబాద్, వెలుగు: జిల్లా కేంద్రంలో మినీ స్టేడియం తరలింపుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఆల్టర్నేట్ చూపకుండా ఉన్న ఒకే ఒక స్టేడియాన్ని కూల్చివేస్తే ఊరుకోబోమని క్రీడా సంఘాలు హెచ్చరిస్తున్నాయి. క్రీడాకారులకు అండగా విద్యార్థి సంఘాలు, క్రీడా సంఘాల తరఫున ఒలంపిక్ సంఘం ఐక్య ఉద్యమానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ కళాభారతి పేర ఆడిటోరియం నిర్మించాలన్న ప్రపోజల్స్ఉన్నట్లు అధికారులు, ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. కానీ స్టేడియం కూల్చివేతపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడం ప్లేయర్లలో ఆందోళన కలిగిస్తోంది.
ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్స్‌కు శంకుస్థాపన
నిజామాబాద్నగరాభివృద్ధి పేరిట ప్రభుత్వం మినీ స్టేడియం, పాత కలెక్టరేట్, తహసీల్దార్, డీఈవో, ఆర్డీవో, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పాతభవనాలను కూల్చివేసింది. ఈ స్థలాల్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు, కళాభారతి ఆడిటోరియం నిర్మించాలని ప్రపోజల్స్ పెట్టింది. ఇందులో భాగంగా అధికారులు ప్రభుత్వ ఆఫీస్‌లను న్యూ కలెక్టరేట్‌కు తరలించారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు, కళాభారతి ఆడిటోరియం నిర్మాణానికి డిసెంబర్ నెలలో మంత్రి కేటీఆర్ శంకుస్థాపన కూడా చేశారు.
ప్లేయర్లకు పెద్ద దిక్కు మినీ గ్రౌండ్
జిల్లా కేంద్రంలో స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్‌ను 1975లో నిర్మించారు. 1999లో మినీ స్టేడియంగా అప్ గ్రేడ్ చేశారు. ఈ స్టేడియం లో జిల్లా స్కూల్ స్పోర్ట్స్ మీట్స్, రూరల్ స్పోర్ట్స్, వివిధ క్రీడల్లో కోచింగ్ఇచ్చేందుకు గ్రౌండ్ ఉపయోగపడుతోంది. దాదాపు 50 ఏండ్లుగా ఈ గ్రౌండ్లో జిల్లాలోని స్టేట్, నేషనల్ ప్లేయర్లు శిక్షణ పొందుతున్నారు. బాక్సింగ్, ఖో-ఖో, కబడ్డీ జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారుల శిక్షణకు మినీ స్టేడియం వేదిక గా ఉంది. నగరంలో ప్లేయర్లకు అందుబాటులో ఉన్న మరో గ్రౌండ్ ఖలీల్ వాడీలో 2012లో జనరల్ హాస్పిటల్ నిర్మాణం జరిగింది. అప్పటి నుంచి మినీ స్టేడియం క్రీడాకారులకు ఒకే గ్రౌండ్ పెద్దదిక్కుగా మారింది. 1990లో రాజారం స్టేడియం నిర్మించారు. కానీ ఈ స్టేడియం జిల్లా కేంద్రానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో ప్లేయర్లు వెళ్లలేదు. ఇందులో1998లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ఇండియా ఆర్చరీ అకాడమీని ఏర్పాటు చేసింది. అది కూడా తరలిపోవడంతో రాజారాం స్టేడియం నిరూపయోగంగా మారింది.
రాజకీయ లబ్ధి కోసమేనని..
ప్రభుత్వ బిల్డింగ్స్కూల్చివేత వెనుక రాజకీయ లబ్ధి ఉందని నగరవాసులు ఆరోపిస్తున్నారు. 8 ఏండ్ల కింద చేపట్టిన బొడ్డెమ్మ చెరువు ట్యాంక్ బండ్, అండర్ డ్రైన్నిర్మాణ పనులు ఇంకా పూర్తి చేయలేదు. నగరంలో ట్రాఫిక్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. ఇలా ఏ సమస్యను పట్టించుకోకుండా ఉన్న బిల్డింగ్స్, స్టేడియాన్నికూలగొట్టడమేమిటని మండిపడుతున్నారు. ఈ స్థలాలను ప్రైవేట్వ్యక్తులకు లీజులకు ఇచ్చేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. ఈ భూములు ప్రైవేట్‌పరం కాకుండా చూడాలని కోరుతున్నారు.
స్టేడియాన్ని కూల్చివేస్తే ఉద్యమమే..
మినీ స్టేడియం ప్రాంతాన్ని కలిపి కళాభారతి నిర్మించే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలి. మినీస్టేడియాన్ని కూల్చివేస్తే ఉద్యమిస్తాం. క్రీడల్లో ఇక్కడ శిక్షణ పొందుతున్న ప్లేయర్లు నేషనల్, ఇంటర్నేషనల్స్థాయిలో రాణిస్తున్నరు. ఇందూరులో ఉన్న ఒకే ఒక స్టేడియాన్ని కళాభారతి పేరుతో దూరం చేయొద్దు.
- నవీన్, ఏబీవీపీ లీడర్
స్టేడియాన్ని తరలించొద్దు
ప్లేయర్లకు అన్ని రకాలుగా అందుబాటులో ఉన్న మినీ స్టేడియాన్ని తరలిస్తే క్రీడాసంఘాల తరఫున ఉద్యమిస్తాం. ఖలీల్వాడీలో హాస్పిటల్ నిర్మించారు. పాలిటెక్నిక్ గ్రౌండ్ లోకి ఇతరులకు అనుమతి ఉండదు. ఒక వేళ ప్లేయర్లు రాజారాం స్టేడియానికి వెళ్లాలంటే 8 కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంటుంది. ఆల్టర్నేట్స్టేడియం లేనప్పుడు కూల్చివేయడం సరికాదు.
- అందెల లింగయ్య, కబడ్డీ సంఘం ప్రతినిధి