పాల్వంచ KTPS విద్యుత్ కేంద్రం కూలింగ్ టవర్లు కూల్చివేత

పాల్వంచ KTPS విద్యుత్ కేంద్రం కూలింగ్ టవర్లు కూల్చివేత

పాల్వంచ లో కేటిపిస్ పాత ప్లాంట్ లో కాలం చెల్లిన 8 కూలింగ్ టవర్లలో నాలుగు కూలింగ్ టవర్లను కూల్చివేశారు .మధ్యాహ్నంలోపు  మరో నాలుగు టవర్లను కుసిల్లీవేయనున్నట్లు తెలిపారు అధికారులు.1966లో ఈ టవర్లను జపాన్ టెక్నాలజీ తో నిర్మించారు. తొలుత ఏ స్టేషన్లో60 మెగావాట్లు సామర్థ్యం కలిగిన  నాలుగు యూనిట్స్ ని నిర్మించగా,1977 లో  బి మరియు సి స్టేషన్ లో 120 మెగావాట్ల సామర్థ్యం కలిగిన నాలుగు యూనిట్లను నిర్మించారు.

ప్రస్తుతం ఓ.అండ్.ఎం.లో 720 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం తో కొనసాగుతుంది. 2022 లో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఆదేశనుసారం ఈ స్టేషన్లను మూసివేశారు .ఓ.అండ్.ఎం.లోని ఏ బి సి విద్యుత్ స్టేషన్ లు తొలగింపు పనులను ముంబైకు చెందిన హెచ్.అర్.కమర్షియల్ లిమిటెడ్ కు అప్పగించింది జెన్ కో .

పాత ప్లాంట్ లో మొత్తం 8 కూలింగ్ టవర్స్ కాగా... ఇప్పటికీ 4 కూలింగ్ టవర్లను ఇన్ప్లోజర్ బ్లాస్టింగ్(ఉన్న చోట కుప్పకులడం) ఆధునాతన పద్దతి లో కూల్చివేశారు.