నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఫుట్ పాత్ పై ఆక్రమణలు ఆర్మూర్ పట్టణంలో ఉద్రిక్తత. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఆక్రమణ దుకాణాలను తొలగించేందుకు మునిసిపల్ సిబ్బంది వెళ్లగా.. నిర్వాహకులు అడ్డుకున్నారు. ఎలాంటి సమాచారం లేకుండా షాపులు తొలగిస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పండ్ల వ్యాపారులు.
మునిసిపల్ సిబ్బందికి, వ్యాపారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది. విషయం తెలుసుకున్న సీఐ సంఘటనాస్థలానికి చేరుకొని సంఘటన స్థలానికి చేరుకున్న సిఐ పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం పోలీస్ బందోబస్తు మధ్య ఆక్రమణల తొలగింపు కొనసాగించారు.