అక్రమ కట్టడాల కూల్చివేత

అక్రమ కట్టడాల కూల్చివేత

కూసుమంచి, వెలుగు : అసైడ్​భూమిలో అక్రమ కట్టడాలను రెవెన్యూ అధికారులు మంగళవారం తొలగించారు. కుసుమంచి తహసీల్దారు సురేశ్​కుమార్​ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నాయకన్​గూడెం గ్రామంలో హైవే పక్కన ఈద్గా స్థలాన్ని  ఓ ప్రజాప్రతినిధి ఆక్రమించినట్లు ముస్లింలు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో సర్వే చేపట్టిన రెవెన్యూ అధికారులు మంగళవారం అక్రమ కట్టడాలను కూల్చివేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్​ సురేశ్​కుమార్, ఆర్​ఐలు రాము, లింగమూర్తి, సర్వేయర్​ రవికుమార్, సీఐ జనార్దన్, ఎస్సై కిరణ్​కుమార్​ పాల్గొన్నారు.