
బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి పట్టణంలో ప్రభుత్వ భూములు ఆక్రమించి అక్రమంగా నిర్మించిన ఇళ్లను మున్సిపల్, రెవెన్యూ అధికారులు జేసీబీలతో కూల్చి వేయించారు. కలెక్టర్, ఆర్డీ ఓ ఆదేశాలతో పట్టణంలోని ఎల్లమ్మ గుడి ఇందిరమ్మ కాలనీ, అంబేద్కర్ రడగంబాల బస్తీ, గంగారాంనగర్ కాలనీల్లో మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ఆదిలక్ష్మి,విజయలక్ష్మి పర్యటించారు.
ఆక్రమణలను గుర్తించి, కూల్చి వేశారు. భూ కబ్జా దారులు ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే. చట్ట పరమైన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు.