గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అధికారులు అక్రమ నిర్మాణాల కూల్చివేతకు పూనుకున్నారు. వరంగల్ నగర పరిధిలో గల కోట చెరువు, చిన్న వడ్డేపల్లి చెరువు బఫర్ జోన్, ఎఫ్ టి ఎల్ పరిధి తాత్కాలిక షెడ్లు, ప్రహరీ గోడలు కూల్చివేస్తున్న GWMC టాస్క్ ఫోర్స్ సిబ్బంది కూల్చి వేస్తున్నారు. బల్దియా అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా తాత్కాలిక షెడ్లు నిర్మించారని.. వాటిని మాత్రమే నేలమట్టం చేస్తున్నామని బల్దియా సిబ్బంది తెలిపారు.
కాగా కూల్చివేతలను భూ యజమానులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంటి నిర్మాణాలకు ప్రభుత్వమే అనుమతులు ఇచ్చిందని.. మళ్లీ ఇప్పుడు ప్రభుత్వమే కూల్చేస్తుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే హై కోర్టు ఆదేశాలతో అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతల కార్యక్రమం నిర్వహించారు అధికారులు.