రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు ఏఫ్ టిఏల్ పరిధిలో వెలసిన అక్రమ నిర్మాణాలను రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు కూల్చివేశారు. జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశాల మేరకు చెరువులు, కుంటలు పరిరక్షించేందుకు మండల పరిధిలో ఎఫ్ఎల్ లో చేపడుతున్న అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూన్నామని ఇబ్రహీంపట్నం ఏంఆర్ఓ సునీత రెడ్డి తెలిపారు.
మండల పరిధిలో చెరువు, కుంటలు అక్రమనకు గురై నిర్మాణాలు చేపడితే.. తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలకు తెలిపారు. అక్రమనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తహసిల్దార్ హెచ్చరించారు.