ఎల్బీనగర్​లో అక్రమ నిర్మాణాల కూల్చివేత 

  • కొనసాగుతున్న జీహెచ్ఎంసీ, ట్రాఫిక్​ పోలీసుల స్పెషల్​ డ్రైవ్

ఎల్బీనగర్, వెలుగు: ఎల్బీనగర్​నియోజకవర్గంలో ఆక్రమణల తొలగింపు కొనసాగుతోంది. రోడ్లను ఆక్రమించి ఏర్పాటు చేసిన షాపులు, నిర్మాణాలను ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు తొలగిస్తున్నారు.

బుధవారం జీహెచ్ఎంసీ ఎల్బీనగర్​సర్కిల్–4 పరిధిలోని డీవీఎం కాలేజీ నుంచి రింగ్ రోడ్డు వరకు, సువిధ ఆర్చిడ్, కామినేని హాస్పిటల్​రోడ్, హయత్​నగర్ రోడ్, ఆర్టీసీ కాలనీ రోడ్, గవర్నమెంట్​స్కూల్​రోడ్ల పాత్​లపై ఏర్పాటు చేసిన షాపులను జేసీబీతో తొలగించారు. కూల్చివేతలో ట్రాఫిక్ ఇన్​స్పెక్టర్లు జగదీశ్, నాగరాజు, ఎల్బీనగర్ డిప్యూటీ కమిషనర్ సుల్తానా తదితరులు పాల్గొన్నారు.