మంచిర్యాల, వెలుగు: మంచిర్యాలలోని మార్కెట్రోడ్లో అక్రమ నిర్మాణాలను మున్సిపల్ అధికారులు గురువారం పోలీసు బందోబస్తు మధ్య కూల్చేశారు. సెట్‌బ్యాక్ లేకుండా, ఫుట్‌పాత్‌లను ఆక్రమించి, డ్రైనేజీలపైన కట్టిన నిర్మాణాలను జేసీబీలతో తొలగించారు. రోడ్లపైకి వచ్చి బిల్డింగ్ లు కట్టడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి.
ఆక్రమణలను తొలగించాలని మున్సిపల్అధికారులు ఐదు నెలల కింద నోటీసులు ఇచ్చారు. అయినా స్పందించకపోవడంతో బుధవారం మార్కింగ్ చేసి కూల్చివేతలు చేపట్టారు. అజయ్స్పోర్ట్స్, అర్చన టెక్స్ చౌరస్తాలోని బిల్డింగ్ ల ఆక్రమణలను కూల్చేశారు. రెండు రోజుల్లోగా తమ ఆక్రమణలను తొలగించాలని, లేదంటే తామే కూల్చేస్తామని అధికారులు స్పష్టంచేశారు. దీంతో యజమానులు నిర్మాణాలను తొలగిస్తున్నారు.
ALSO READ | శనిగకుంట మత్తడి ధ్వంసం కేసులో మరో ఏడుగురు అరెస్ట్ : డీసీపీ ఏ.భాస్కర్