మణికొండ, కోకాపేటలో అక్రమ నిర్మాణాల కూల్చివేత

గండిపేట, వెలుగు: మణికొండ మున్సిపాలిటీ పరిధిలో వెలసిన అక్రమ నిర్మాణాలపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అల్కాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌29లో జీప్లస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–5కు పర్మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకుని అదనంగా మరో ఫ్లోర్​నిర్మిస్తున్నట్లు మణికొండ మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రదీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్, టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లానింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్​సంతోష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గుర్తించారు. గురువారం నిర్మాణాల వద్దకు చేరుకుని, అదనపు ఫ్లోర్లను కూల్చివేయించారు.

మొత్తం ఏడు బిల్డింగ్స్​పై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అక్రమ నిర్మాణాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే నార్సింగి మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నట్లు కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రవీణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి తెలిపారు. కోకాపేట, గౌలిదొడ్డిలో జీప్లస్–3కి పర్మిషన్​తీసుకుని అదనపు ఫ్లోర్లు నిర్మిస్తున్న బిల్డింగ్స్ పై శుక్రవారం చర్యలు తీసుకున్నామని చెప్పారు.