మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో అక్రమంగా వెలిసిన నిర్మాణాలకు రెవెన్యూ అధికారులు అడ్డుకట్ట వేశారు. అనుమతి లేకుండా ఘట్కేసర్ మండలం ప్రతాప్ సింగారంలోని 378 సర్వే నెంబర్లలో ఉన్న ప్రభుత్వ భూముల్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను వెలిసిన నిర్మాణాలను కూల్చివేశారు.
ప్రభుత్వ భూముల్లో ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే.. సహించేది లేదని వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి.. చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ హెచ్చరించారు. ఇప్పటికే పలువురికి నోటీసులు కూడా ఇచ్చామని, త్వరలోనే మరిన్ని అక్రమ నిర్మాణాలను కూల్చివేయనున్నట్లు అధికారులు తెలిపారు.