- హైకోర్టు ఆదేశాలతో అధికారుల చర్యలు
సిరిసిల్ల టౌన్, వెలుగు : మున్సిపల్ వైస్ చైర్మన్‌కు చెందిన బిల్డింగ్ ను కూల్చివేసిన ఘటన సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగింది. సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ మంచె శ్రీను అక్రమంగా నిర్మించుకున్న బిల్డింగ్‌లోని సెల్లార్‌ను గోడౌన్ గా వాడుతున్నాడని, సెప్టిక్ ట్యాంక్ లేకుండా టాయిలెట్స్ నిర్మించాడని బీజేపీ లీడర్ నాగుల శ్రీనివాస్ మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.
అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు గురువారం బిల్డింగ్ ముందు భాగాన్ని మున్సిపల్ అధికారులు పాక్షికంగా కూల్చివేశారు.