నల్గొండలో బీఆర్ఎస్ ఆఫీస్  కూల్చివేతకు బ్రేక్​! 

నల్గొండలో బీఆర్ఎస్ ఆఫీస్  కూల్చివేతకు బ్రేక్​! 
  • పార్టీ ఆఫీస్ రెగ్యులరైజేషన్ అప్లికేషన్ రద్దు చేసిన మున్సిపాలిటీ
  • దీంతో హైకోర్టును ఆశ్రయించిన పార్టీ నాయకత్వం 
  • ప్రత్యామ్నాయ మార్గం చూపాలని హైకోర్టు డైరెక్షన్​ 

నల్గొండ, వెలుగు : నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కూల్చివేతకు తాత్కాలికంగా బ్రేడ్​పడినట్టే కనిపిస్తోంది. ఆగస్టు 11లోగా పార్టీ ఆఫీస్ కూల్చివేయాలని జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అధికారులకు డెడ్​లైన్ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే నెలరోజులు అవుతున్నా పార్టీ ఆఫీస్ కూల్చివేతపై అధికారుల నుంచి ఎలాంటి కదలిక లేదు. పార్టీ ఆఫీస్ ను టచ్​చేస్తే అంతుచూస్తామని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్​రెడ్డి సైతం హెచ్చరించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పార్టీ ఆఫీస్ వివాదం పెద్ద రాజకీయ దుమారం రేపింది.

పార్టీ బిల్డింగ్​కు మున్సిపల్​పర్మిషన్​ లేదని, దాన్ని​కూల్చేయాలని డీటీసీపీ కమిటీ సిఫార్సు చేసింది. దీంతో అధికారులు సైతం టెన్షన్ పడ్డారు. చివరకు బీఆర్​ఎస్ నాయకత్వం హైకోర్టును ఆశ్రయించింది. రెగ్యులరైజేషన్​ పర్మిషన్ లేనందున దీనికి ప్రత్యామ్నాయం మార్గం చూపాలని హైకోర్టు డైరెక్షన్ ఇచ్చిందని మున్సిపల్​ కమిషనర్​ముసాక్ అహ్మద్​తెలిపారు. ప్రస్తుతానికి పార్టీ ఆఫీస్ కూల్చివేత ఆగిపోయినట్టేనని భావిస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గం చూపడమనే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని, అప్పటివరకు వెయిట్ చేయక తప్పదని మున్సిపల్ వర్గాలు 
తెలిపాయి.