మావోయిస్టు అమరవీరుల స్థూపాల కూల్చివేత

మావోయిస్టు అమరవీరుల స్థూపాల కూల్చివేత

భద్రాచలం, వెలుగు :  ఛత్తీస్​గఢ్​ రాష్ట్రంలోని బీజాపూర్​ జిల్లా దండకారణ్యంలో మావోయిస్టు అమరవీరుల స్మారక స్థూపాలను భద్రతాబలగాలు కూల్చివేస్తున్నాయి. ఇటీవలే మావోయిస్టు ప్రభావిత మారుమూల కొండాపల్లిలో కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో బేస్​ క్యాంపును ఏర్పాటు చేశారు.

బీజాపూర్​కు చెందిన డీఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా తదితర బలగాలు జేసీబీల సాయంతో గురువారం నుంచి కొండపల్లి గ్రామంలో 20, 30 అడుగుల ఎత్తుతో నిర్మించిన స్థూపాలను కూల్చివేశాయి. శుక్రవారం కూడా చుట్టుపక్కల అటవీ ప్రాంతంలో స్థూపాలను పడగొడుతున్నారు. కొండపల్లి గ్రామం చుట్టూ అటవీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భద్రతాబలగాలు గస్తీ తిరుగుతున్నాయి. మావోయిస్టులు ఈ చర్యలను అడ్డుకునేందుకు దాడులకు పాల్పడే అవకాశం ఉండడంతో కూంబింగ్​ నిర్వహిస్తున్నారు.