తాడేపల్లిలో వైసీపీ ఆఫీస్ కూల్చివేత 

తాడేపల్లిలో వైసీపీ ఆఫీస్ కూల్చివేత 

తాడేపల్లిలోని వైఎస్సార్ సిపీ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని CRDA అధికారులు కూల్చివేశారు. శనివారం (జూన్ 22) ఉదయం 5.30 గంటల నుంచే పోలీసులు సమక్షంలో కూల్చివేత జరుగుతున్నాయి. ప్రొక్లెయిన్లు, బుల్డోజర్లతో మున్సిపల్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. శ్లాబ్ కు సిద్ధంగా ఉన్న భవాన్ని కూల్చివేశారు. అదే సమయం లో  ప్రాంతానికి వైసీపీ నేతలు, కార్యకర్తలు ఎవరూ వెళ్లకుండా గేట్లు వేసి భారీగా పోలీసులను మోహరించారు. 

నిర్మాణంలో ఉన్న ఈ భవనాన్ని కూల్చేయాలన్న సీఆర్డీయే ప్రిలిమినరీ ప్రోసీడింగ్స్ ను సవాల్ చేస్తూ వైఎస్సార్ సీపీ ఇదివరకే హైకోర్టును ఆశ్రయించింది. చట్టాన్ని మితిమీరి వ్యవహరించొద్దని కోర్టు సీఆర్డీయేకు సూచించింది. అయినా కూడా మున్సిపల్ అధికారులతో సీఆర్డీయే ఈ కూల్చివేతలు జరుపుతుందని వైసీపీ నేతలు అంటున్నారు. 

సీఆర్డీయే కమిషనర్ కు హైకోర్టు ఆదేశాలను తెలియజేశారు వైఎస్సార్ సీపీ న్యాయవాది.. అయినప్పటికీ కూడా తాడుపల్లిలోని నిర్మాణంలో ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని కూల్చివేసింది కూటమి ప్రభుత్వం. దీంతో హైకోర్టు ఆదేశాలను లెక్కచేయకుండా వైఎస్సార్ సీపీ పార్టీ కార్యాలయ భవనాన్ని కూల్చివేసి కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లామంటున్నారు వైసీపీ నేతలు.