ఘట్కేసర్, వెలుగు: వరంగల్ హైవే వెంట ఉన్న అక్రమ కట్టడాన్ని అధికారులు కూల్చివేశారు. మైసమ్మ గుట్ట సమీపంలో సర్వీస్ రోడ్డు పక్కన ఉన్న నాలాను ఆక్రమించి దాదాపు 250 గజాల్లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారు.
దీంతో అధికారులు రంగంలోకి దిగి అక్రమ నిర్మాణాలను బుధవారం కూల్చివేశారు. నాలాలున్న చోట నిర్మాణాలు చేపట్టాలంటే ముందుగా ఎన్ఓసీ తీసుకోవాలని ఘట్కేసర్ ఇరిగేషన్ శాఖ ఏఈ పరమేశ్వర్ సూచించారు.