వనపర్తిలో రెండో రోజూ కొనసాగిన కూల్చివేతలు

వనపర్తి, వెలుగు: ఎఫ్​​టీఎల్, బఫర్ ​జోన్​ పరిధిలో ఉన్న నిర్మాణాల కూల్చివేత రెండో రోజూ కొనసాగింది. శుక్రవారం మున్సిపల్​ ఆఫీసర్లు నల్లచెరువు, మర్రికుంట చెరువు, తాళ్లచెరువు, అమ్మచెరువుల ఎఫ్​టీఎల్, బఫర్ ​జోన్​ల సర్వే చేపట్టారు. నల్లచెరువు వద్ద వెంచర్​ గోడను రెండో రోజూ కూల్చివేశారు.  మర్రికుంట చెరువు, తాళ్లచెరువు పరిధిలో అక్రమ నిర్మాణాలకు నోటీసులు ఇచ్చారు. 

అమ్మ చెరువు వద్ద గోడ బఫర్ ​జోన్​కి వస్తుందని గుర్తించారు. మున్సిపల్​ అధికారులు హైడ్రాను అమలుచేస్తుండడంతో గతంలో చెరువుల వద్ద ప్లాట్లు కొని ఇళ్లు నిర్మించుకున్న వారు, ప్లాట్లు ఉన్న వారిని బీసీ పొలిటికల్​ జేఏసీ చైర్మన్​ రాచాల యుగంధర్​ గౌడ్​ బాధితులతో మాట్లాడారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.