హైడ్రా ఆదేశాలతో భారీ బందోబస్తు మధ్య అమీన్‌పూర్‌లో కూల్చివేతలు

హైడ్రా ఆదేశాలతో భారీ బందోబస్తు మధ్య అమీన్‌పూర్‌లో కూల్చివేతలు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే కాకుండా చుట్టు పక్కల ఉన్న గ్రామాల్లో కబ్జాలకు గురైన చెరువులు, నాళాలపై హైడ్రా కొరడా జులిపిస్తుంది. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలంలోని పలు అక్రమ కట్టాలను తహశీల్దార్ రాధా, హైడ్రా అధికారులు దగ్గరుండి కూల్చివేయించారు. ఐలాపూర్ గ్రామ పంచయతీ సర్వే నెంబర్ 119, 121లో  అక్రమ వెంచర్ వెంచర్ ఏర్పాటు చేసి నిర్మాణాలు చేశారు. హైడ్రా ఆదేశాల మేరకు సెప్టెంబర్ 3న రెవిన్యూ అధికారులు వెంచర్ అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. 

Also Read:-ఆక్రమణల వల్లే ఖమ్మంలో వరదలు

అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని సర్వే నంబర్ 462 లోని ప్రభుత్వ భూమిలో ప్యూజియన్ ప్రైవేటు స్కూల్ లో హైడ్రా ఆదేశాలతో రెవెన్యూ, మున్సిపల్ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. సర్వేనెంబర్ 462 లో గల ప్రభుత్వ భూమిలోని 17 గుంటల్లో నిర్మించిన స్కూల్ గేటు, రూమ్స్, గ్రౌండ్ ను జేసీబీలతో కూల్చివేశారు. కూల్చివేతకు ఎవ్వరూ ఆటంకాలు కలిగించకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.