ఆల్టర్నేట్ మెడికల్ కోర్సులకు పెరుగుతున్నఆదరణ

ఆల్టర్నేట్ మెడికల్ కోర్సులకు పెరుగుతున్నఆదరణ

దేశంలో హెల్త్ టూరిజం డెవలప్‌ మెంట్ బాగా పెరుగుతోంది. ఇప్పటికే చాలా నగరాల్లో కార్పొరేట్ హాస్పిటల్స్‌‌ రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. హెల్త్ పాలసీల కారణంగా మధ్యతరగతి,ఉద్యోగస్తులు కార్పొరేట్ వైద్యానికే మొగ్గు చూపుతున్నారు . దీంతో నర్సులు, ల్యాబ్ టెక్నిషియన్ల అవసరం రాబోయే రోజుల్లో గణనీయంగా పెరిగే అవకాశం ఉందని పలు సర్వేలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న విభిన్నకోర్సులివే..

ఆక్యుపేషనల్‌ థెరఫీ

రిహాబిలిటేషన్‌ ద్వారా జబ్బులను నయంచేయడంపై వీరు దృష్టి సారిస్తారు. వైద్యులు సూచించిన నివారణ పద్ధతులను అనుసరించి పెషేంట్లలో మెరుగైన వైద్య ఫలితాలు వచ్చేలాప్రణాళిక ప్రకారం థెరఫీ అందిస్తారు.

శిక్షణ: రోగి చుట్టుపక్కల వాతావరణంలోఎలాంటి మార్పులు చేయాలి, రోజువారీజీవితంలో ఏం మార్పులు తీసుకురావాలి తదితరఅంశాలను నేర్పుతారు . పీడియాట్రిక్స్‌‌, హ్యాండ్‌‌ థెరపీ, అడల్ట్‌‌ రిహాబిలిటేషన్స్‌‌ మొదలైన స్పెషలైజే-షన్లలో ప్రత్యేకంగా శిక్షణ పొందే వీలుంది.

అరత్హ : ఇంటర్ లో బైపీసీ చదివిన వారు అర్హులు.ఇది 4 సంవత్సరాల కోర్సు. కొన్ని ప్రైవేట్ సంస్థలుఇంటర్‍ మార్కుల మెరిట్‌ ఆధారంగా ప్రవేశాలుకల్పిస్తున్నా యి. యూనివర్సిటీలు సొంత ప్రవేశప-రీక్షలను నిర్వహించి సీట్లను భర్తీ చేస్తాయి.

ఫిజియోథెరపీ

ప్రమాదాల్లో ఎముకలు/కండరాలు విరగడం,కదలడం, ముసలి తనం కారణంగా తలెత్తే కీళ్ల నొప్పులు తదితర సమస్యలకు ఫిజియోథెరపిస్టులు చికిత్సను అందిస్తారు. ఎముకలు జరగడం,దెబ్బలు తగలడం, విరగడం వంటి సందర్భాల్లో వీరి అసరం ఉంటుంది.

శిక్షణ: శరీరంలో ని వివిధ భాగాల్లో ని ఎముకలు,కండరాలు, నరాలు తదితరాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడానికి వీలుగా హ్యూమన్‌ అనాటమీలోని వివిధ అంశాలను ఈ కోర్సులో భాగంగా నేర్పుతారు . వయసు పైబడటం ద్వారావచ్చే ఎముకల సమస్యలు, వ్యాధులు, గాయాలుమొదలైన వాటికి కూడా ఫిజియోథెరపిస్టులుచికిత్స అందిస్తారు.

అరత్హ: ఇంటర్ లో బైపీసీ చదివినవారు అర్హులు. బీఎస్‌‌సీ/ బీపీటీ, డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నా యి. బీఎస్‌‌సీ 3 ఏండ్ల కోర్సు, బీపీటీ 4ఏండ్లు, ఆరు నెలల ఇంటర్న్‌‌షిప్‌ కూడా చేయాల్సిఉంటుంది. డిప్లొమా కోర్సులు 2–3 సంవత్సరాలు ఉంటాయి. రాష్ట్ర, కేంద్ర యూనివర్సిటీలునిర్వహించే ఎంసెట్‍, సీఈటీ, జీజీఎస్‌‌ఐపీయూ,సీఈటీ ప్రవేశ పరీక్షల ద్వారా అడ్మిషన్లు పొందేవీలుంది.

ఆపరేషన్‌‌ థియేటర్‌ టెక్నాలజీ

ఆపరేషన్‌ గదిలో పేషెంట్‌ , వైద్య బృందా నికిఅవసరమైన పరికరాలను అందుబాటులో ఉంచేబాధ్యత వీరిదే. ఆపరేషన్లు జరిగే సమయంలో వీరిపాత్ర కీలకమైనది.శిక్షణ: ఆపరేషన్‌ గదిని శస్త్రచికిత్సకు సిద్ధంచేయడం, ఆపరేషన్‌ కు ముందు పేషెంట్‌ నుగదిలోకి తీసుకెళ్లడం, పూర్తయ్యాక వేరే గదిలోకితరలిం చడం, సర్జరీ చేసేవారికి, అనస్థీషియావారికి, నర్సులకు టెక్నికల్‌‌ సాయం అందిం చడంవంటి అంశాల్ని ఈ కోర్సులో భాగంగా నేర్పిస్తారు .

అరత్హ : సైన్స్‌‌ విభాగంలో ఇంటర్‌‌ పూర్తిచేసినవారుఅర్హులు. దీనిలో బీఎస్‌‌సీ, డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నా యి. డిగ్రీ కోర్సుల కాలవ్యవధి మూడేళ్లు కాగా, డిప్లొమా కోర్సుల వ్యవధి 1–2సంవత్సరాలు. మెరిట్‌ ఆధారంగా ప్రవేశాలుంటాయి. నిమ్స్‌‌ స్కూల్‌‌ ఆఫ్‌ పారామెడికల్‌‌ సైన్సెస్‌‌ అండ్‌‌ టెక్నాలజీ, టెక్‌ మహీంద్రా స్మార్ట్‌‌ అకాడమీఫర్‌‌ హెల్త్‌‌కేర్‌‌ వంటి సంస్థలు ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారాఅడ్మిషన్లు అందిస్తున్నా యి.

డయాలసిస్‌ టెక్నాలజీ

రక్తాన్ని శుద్ధి చేయడం మూత్రపిండాల ప్రధానవిధి. వీటి పనిలో ఏదైనా ఆటంకం ఏర్పడినపుడుసంబంధిత వ్యక్తికి డయాలసిస్‌‌ చేయడం ద్వారా వ్యర్థాల్ని బయటకు పంపిస్తారు. దీన్ని మాన్యువల్ గా రక్తాన్ని శుద్ధిచేసే ప్రక్రియగా చెప్పొచ్చు. డయాలసిస్‍ టెక్నాలజీస్టులు ఈ ప్రక్రియను చేప-డతారు.

శిక్షణ: కోర్సులో భాగంగా డయాలసిస్‌‌కు సం-బంధించిన పరికరాలు, వాటిని ఉపయోగించేతీరు, ప్రక్రియకు ముందు, తరువాత చేపట్టాల్సి నవిధులను నేర్పుతారు . అనాటమీ, ఫిజియా-లజీ, రెంటల్‌‌ డిసీజెస్‌‌, బ్లడ్‌‌ కెమిస్ట్రీ మొదలైనఅంశాలనూ ఈ కోర్సులో భాగంగా నేర్చు-కుంటారు.

అరత్హ : ఇంటర్ లో బైపీసీ పూర్తిచేసినవారు అర్హులు.బీఎస్‌‌సీ, డిప్లొమా కోర్సులున్నా యి. బీఎస్‌‌సీకోర్సుల కాలవ్యవధి మూడేళ్లు, డిప్లొమా 1-–2ఏండ్లుంటుం ది. ఇంటర్ మెరిట్‌ ఆధారంగా ఆడ్మిషన్లు కల్పిస్తాయి.

నర్సింగ్‌

ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ 10 వృత్తుల్లోనర్సింగ్‌ ఒకటిగా పేర్కొంటారు. గాయపడిన లేదా ఆరోగ్యం దెబ్బతిన్న వారికి చికిత్సతో పాటుమానసికంగా ధైర్యాన్ని అందించేవారే నర్సులు.శిక్షణ: నర్సిం గ్‌ నైపుణ్యాలను కోర్సు ద్వారానేర్చుకుంటారు. కోర్సులో భాగంగా థియరిటి కల్‌‌ పరిజ్ఞా నంతోపాటు ప్రాక్టికల్‌‌ నాలెడ్జ్‌‌నూతెలసుకుంటారు. నర్సిం గ్‌ కు సంబంధించి ప్రాథమిక పరిజ్ఞానం, ప్రాథమిక చికిత్స, మిడ్‌‌వైఫరీఅంశాలపై శిక్షణ ఇస్తారు.

అరత్హ : ఇంటర్‌‌లో బయాలజీ చదివినవారుఅర్హులు. ఇది 4 ఏండ్ల బీఎస్‌‌సీ కోర్సు. తెలుగు రాష్ట్రా ల్లో ఎంసెట్‌ ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్నారు .డిగ్రీ, డిప్లొమా కోర్సులను రాష్ట్రంలోని పలు విద్యాసంస్థలు, ప్రైవేటు ఆస్పత్రులకు చెందిన కాలేజీలు నిర్వహిస్తున్నాయి.ఇవేకాకుం డా.. రేడియాలజీ, ఎక్స్‌‌రే టెక్నాలజీ,మెడికల్‌ రికార్డ్‌ టెక్నాలజీ, పర్‌ ఫ్యూషన్‌‌ టెక్నాలజీ వంటి విభాగాల్లో బీఎస్‌ సీ కోర్సులుఅందుబాటులో ఉన్నాయి.

కోర్సులు

  • ఆక్యుపేషనల్‌ థెరఫీ(ఫిజికల్‍ థెరఫీ)
  • ఆడియాలజీ అండ్‌ స్పీచ్‌ థెరపీ
  • ఫిజియోథెరపీ
  • ఆపరేషన్‌‌ థియేటర్‌ టెక్నాలజీ
  •  నర్సింగ్‌
  •  డయాలసిస్‌ టెక్నాలజీ