కొత్తపల్లి, వెలుగు : పద్మనగర్ పారమిత హెరిటేజ్ స్కూల్‌లో నిర్వహించిన ప్రాజెక్ట్ బేస్డ్లెర్నింగ్ ప్రదర్శన ఆకట్టుకుంది. మంగళవారం ముగింపు వేడుకలకు డీఈవో జనార్ధన్‌రావు హాజరయ్యారు. విద్యార్థుల్లోని క్రియేటివిటీ వెలికి తీయాలనే ఆలోచనతో ఏటా ప్రాజెక్ట్ బేస్డ్లెర్నింగ్నిర్వహిస్తున్నామని చైర్మన్ ప్రసాదరావు తెలిపారు. 3 వేల మంది విద్యార్థులు 400 గ్రూపులుగా ప్రాజెక్టులు ప్రదర్శించారు.
వీరిలో 40 గ్రూపులు సెలక్ట్ కాగా 40 గ్రూపుల్లో నుంచి 60 మంది విద్యార్థులతో కూడిన 12 గ్రూపులు పీబీఎల్ అవార్డు విజేతలుగా నిలిచినట్లు ఆయన వివరించారు. వ్యవసాయ పరిశోధనా కేంద్రం డైరెక్టర్ డాక్టర్ మంజులత, విద్యాసంస్థల అధినేత ప్రసాదరావు విజేతలకు అవార్డులు, సర్టిఫికెట్స్ పంపిణీ చేశారు. స్కూల్ డైరెక్టర్స్ ప్రసూన, వినోదరావు, వీయూఎం ప్రసాద్, హనుమంతరావు, హెచ్ఎం రితేష్ మెహత పాల్గొన్నారు.