Demonte Colony 2: జూన్​6నే ఎందుకు? డిమోంటి కాలనీ2 చూడొచ్చా..? టైం వేస్టా..?

Demonte Colony 2: జూన్​6నే ఎందుకు? డిమోంటి కాలనీ2 చూడొచ్చా..? టైం వేస్టా..?

టైటిల్: డిమోంటి కాలనీ2

ప్లాట్​ఫామ్: జీ 5

డైరెక్టర్: అజయ్​ జ్ఞానముత్తు

కాస్ట్: అరుళ్​నిధి, ప్రియా భవాని శంకర్​, అరుణ్​ పాండియన్​, ముత్తుకుమార్

సామ్యూల్ ( సర్జానో ఖలీద్) క్యాన్సర్​బారిన పడతాడు. కానీ అతనిలో బతకాలనే ఆశ బలంగా ఉంటుంది. తీరా జబ్బు నుంచి బయటపడ్డాక ఆత్మహత్య చేసుకుంటాడు. డెబ్బీ (ప్రియా భవాని శంకర్) అతన్ని ప్రేమిస్తుంది. సామ్యూల్​ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నాడనేది ఆమెకి అర్థం కాదు. దాంతో దౌషి అనే ఒక గురువు దగ్గరకు వెళ్తుంది. సామ్యూల్ ఆత్మతో మాట్లాడాలని ఉందని చెప్తుంది. ఈ విషయంలో సామ్యూల్​తండ్రి ఆమెకి సహకరిస్తాడు.

రఘు (అరుళ్ నిధి), శ్రీనివాసన్ (అరుళ్ నిధి) కవల పిల్లలు. ఈ ఇద్దరూ ఆస్తిపరుడైన అమృతలింగం కొడుకులు. ఆయనకున్న 2,500 కోట్ల ఆస్తిలో 25 శాతం రఘుకి, 70 శాతం శ్రీనివాసన్కి, మిగతా ఐదు శాతం రెండో భార్య కూతురు ఐశ్వర్యకి రాస్తాడు. తక్కువ వాటా రావడంతో కోపంతో రగిలిపోతాడు రఘు. అప్పటికే ఒక ప్రమాదం వల్ల శ్రీనివాసన్​ హాస్పిటల్లో ట్రీట్ మెంట్​ తీసుకుంటుంటాడు. అతనికి ట్రీట్​మెంట్​ చేస్తున్న డాక్టర్, డెబ్బీ తండ్రి ఒకరే.

డాక్టర్ని రఘు కలిసినప్పుడు డెబ్బీ, దౌషి అక్కడే ఉంటారు. ‘ఆస్తి నాకు మాత్రమే దక్కాలి.  శ్రీనివాసన్​ను చంపేయమంటాడు రఘు. లైబ్రరీలో ఉన్న ఒక పుస్తకం చదివినవాళ్లు సరిగ్గా జూన్ 6వ తేదీన అనుమానాస్పదంగా చనిపోతున్నారని తెలుస్తుంది. అప్పుడు వాళ్లేం చేస్తారు? ఆ పుస్తకం దేనికి సంబంధించింది? శ్రీనివాసన్​ను రక్షిస్తారా? అనేది కథ. హారర్ సినిమాలను ఇష్టపడేవాళ్లకి నచ్చుతుంది.