డెంగ్యూ ఫీవర్ ..ఇది దోమల ద్వారా సంక్రమించే వైరస్ ద్వారా వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా అడిస్ ఈజిప్టీ ఆడ దోమలు కుట్టడం ద్వారా డెంగ్యూ జ్వరం వస్తుం ది. ఈ ఆడ దోమల మనుషులను కుట్టడం ద్వారా తమకు కావాల్సిన ప్రోటీన్లు సంపాదంచుకుంటాయి. ఈ క్రమంలో వైరస్ లను వ్యాప్తి చేస్తాయి. ఈ దోమలు సూర్యా స్తమయం తర్వాత , సూర్యాస్తమయానికి ముందు అంటే చీకటిపడే ముందు ఎక్కువగా మనుషులపై దాడి చేస్తాయి. రాత్రి వేళల్లో కూడా ఈ మనుషులను కుడుతాయి. ఇవి సాధారణంగా చెట్టు రంధ్రాల్లోనూ, ప్లవర్ ప్లాజాల్లోనూ, ఆల్గేల్లోనూ, నిల్వ ఉంచిన వాటర్ ట్యాంకులు, టైర్లు, కంటైనర్లలో నివాసంఉంటాయి. అక్కడేవాటి గుడ్లను పెంచి పోషిస్తాయి. కాబట్టి మనం అటువంటి ప్రాంతాలను శుభ్రం చేసుకోవాలి. ఇదంతా పక్కన పెడితే ..డెంగీ ఫీవర్ వస్తే.. మన శరీరంలోని ఏయే భాగాలపై ఎటు వంటి ప్రభావం చూపుతాయో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
డెంగ్యూ ఫీవర్, చికున్ గున్యా, ఎల్లో ఫీవర్, జికా వైరస్ ల వ్యాప్తికి ప్రధాన కారణం ఈ అడిస్ ఈజిప్టీ ఆడ దోమ. దీని జీవితకాలం కేవలం మూడు వారాలు మాత్రమే .. ఈ కాలంలో అది గుడ్లు పెట్టి, పొదిగి పిల్లలను చేస్తుంది. ఆ క్రమంలో దానికి కావాల్సిన ప్రోటీన్లను మనుషులను కుట్టడం ద్వారా సంపాదించుకుంటుంది. ఎప్పుడైతే మనుషులను ఈ ఆడిస్ దోమ కుడుతుందో పలు రకాల వైరస్ ల వ్యాప్తికి దోహదం చేస్తాయి.
పొట్ట భాగంలో నొప్పి, స్వల్పంగా జ్వరం ప్రారంభమై తీవ్రతరం కావడం, చర్మంపై ఎర్రటి దద్దుర్లు, తలనొప్పి, వాంతులు, హైఫీవర్, ముక్కు కారటం, అలసట, ఉబ్బిన గ్రంథులువంటి లక్షణాలు ఉంటే డెంగ్యూ లక్షణాలే.. వెంటనే డాక్టర్లను సంప్రదించాలి.
డెంగ్యూ ఫీవర్ మెదడు, నరాలపై ప్రభావం చూపుతుందా?
డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు వెంటనే డాక్టర్లను సంప్రదించి తగిన ట్రీట్ మెంట్ తీసుకోవాలి. లేదంటే.. మెదడు, నరాలపై తీవ్ర మైన ప్రభావం చూపుతుందని డాక్టర్లు అంటున్నారు. డెంగ్యూ వైరస్ ఎప్పుడైతే మన శరీరంలోకి ఎంటర్ అవుతుందో.. అది ముఖ్యంగా రక్తప్రవాహం ద్వారా శరీరం అంతటా వ్యాప్తిస్తుంది. ఈ వైరస్ కణాల ఇమ్మూనిటీ సిస్టమ్ పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా శోషరస కణుపులపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. అపుడు రోగ నిరోధక శక్తి సైటోకిన్స్ అనే ప్రోటీన్లను విడుదల చేస్తుంది. ఇవి డెంగ్యూ వైరస్ తో పోరాడుతాయి. రోగనిరోధక శక్తి నుంచి ఆకస్మిక స్పందన .. మంట, వాపు, చికాకు వంటి లక్షణాలను చూపుతుంది. అంతే కాదు ఇది మెదడులోని వివిధ కణాజాలాన్ని నాశనం చేస్తుంది.
హానికరమైన వైరస్ లు ప్రవేశించడంతో మెదడులోని ఒక రకమైన రక్షిత పొరను దెబ్బతీస్తుంది. ఈ వైరస్ న్యూరాన్ లు (మెదడు కణాలు) గణనీయంగా ప్రభావితం చేస్తుంది. నేరుగా మెదడు పనితీరులో తీవ్ర నష్టం, ఆటంకం కలిగిస్తుంది. డెంగ్యూ వల్ల మెదడువాపు (మెదడులో వాపు), మెనింజైటిస్ (మెదడు, వెన్నుపాము వాపు), మైలిటిస్ (వెన్నుపాములో వాపు) వంటి ప్రాణాంతక సమస్యలకు దారి తీస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.
కాబట్టి.. డెంగ్యూ జ్వరం రాకుండా ముంద స్తు జాగ్రత్తలు తీసుకోవాలి. దోమలు నిల్వ ఉండకుండా మీ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలి.. ఏవైనా పాత టైర్లు, వాటర్ ట్యాంకులు ఉంటే వెంటనే తొలగించుకోవాలి. వర్షాకాలం సీజన్ లో జాగ్రత్తలు పాటించడం ద్వారా డెంగ్యూ వైరస్ బారిన పడకుండా ఉండొచ్చం టు న్నారు డాక్టర్లు. సో బీ కేర్ ఫుల్.