మనుషులు మామూలుగా ఉన్నారా ఏంటీ.. భయం లేదు.. భక్తి అంతకన్నా లేదు.. తెగింపు ఎక్కువైపోయింది.. చెప్పింది మన కోసమే.. మన మంచి కోసమే అనే సోయి లేకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు జనం అనటానికే ఈ ఘటనే నిదర్శనం.. సోషల్ మీడియాలో కామెడీ అయినా.. వాడు చేసిన పనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నా.. ఇది మంచి పద్దతి కాదని చెప్పే వాళ్లూ ఎక్కువగానే ఉన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే...
వాహనదారుల భద్రత విషయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. బైక్ పై వెళ్లే వాళ్లకు హెల్మెట్ మస్ట్ అని చెప్పింది. అయినా ఎవరూ వినటం లేదు.. దీంతో హెల్మెట్ లేకపోతే బంకుల్లో పెట్రోల్ పోయొద్దని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. హెల్మెట్ లేని వాహనదారుడి బండికి పెట్రోల్ పోస్తే.. ఆ పెట్రోల్ బంకుపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది ప్రభుత్వం.
ఇదే సమయంలో.. ఓ ఎలక్ట్రిసిటీ డిపార్ట్ మెంట్ కు చెందిన లైన్ మెన్ పెట్రోల్ కోసం బంకుకు వచ్చాడు. అతనికి హెల్మెట్ లేదు. దీంతో పెట్రోల్ కొట్టలేదు బంకు సిబ్బంది. మళ్లీ మళ్లీ అడిగాడు ఎలక్ట్రిసిటీ లైన్ మెన్.. హెల్మెట్ లేదు కదా.. పెట్రోల్ పోసేది లేదని తెగేసి చెప్పారు.
ALSO READ | సైఫ్ అలీఖాన్ కేసు : కత్తితో పొడిచినోడు ముంబైలోనే దొరికాడు
అంతే మన లైన్ మెన్ కు చిర్రెత్తెకొచ్చింది. మీ పని ఇలా ఉందా.. నాకే పెట్రోల్ పోయలేదంటే.. నువ్వు ఇంకెవరికీ పెట్రోల్ పోయకుండా చేస్తానంటూ.. బంకు సమీపంలో ఉన్న కరెంట్ లైన్లను కట్ చేశాడు. పెట్రోల్ బంకు కరెంట్ కట్ చేశాడు. దీంతో దిమ్మతిరిగి బొమ్మ కనిపించింది పెట్రోల్ బంకు వాళ్లకు.
ఈ ఘటన అంతా అక్కడే ఉన్న పెట్రోల్ బంకు సీసీకెమెరాలో రికార్డ్ అయ్యింది. మొత్తానికి కరెంట్ లైన్ మెన్ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మంచి నెటిజన్లు లైన్ మెన్ ను తిడుతుంటే.. కుర్రోళ్లు మాత్రం పెట్రోల్ బంకు తిక్కకుదిరింది అంటున్నారు. ఎవరి వైర్షన్ ఎలా ఉన్నా.. హెల్మెట్ లేకపోతే.. బండిపై వెళుతున్నప్పుడు ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే నష్టం ఆ లైన్ మెన్ కుటుంబానికే కదా అంటున్నారు మరికొందరు నెటిజన్లు. ఈ ఘటన జరిగింది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హపూర్ ప్రాంతంలో..