వీడెవడండీ బాబు.. సెలవు ఇవ్వలేదని నలుగురిని పొడిచి.. కత్తితో దర్జాగ తిరుగుతున్నాడు..

వీడెవడండీ బాబు.. సెలవు ఇవ్వలేదని నలుగురిని పొడిచి.. కత్తితో దర్జాగ తిరుగుతున్నాడు..

సెలవు ఇవ్వలేదని నలుగురు కొలీగ్ లను పొడిచేశాడు ఓ వ్యక్తి. అది కాదన్నట్టు అదే కత్తితో రోడ్డెక్కి దర్జాగా నడుచుకుంటూ వెళ్తుండటం అందరినీ ఆశ్చర్యానికి, భయానికి గురి చేసింది. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్ కతా లో జరిగింది ఈ ఘటన. 

‘‘అమిత్ కుమార్ సర్కార్ అనే ప్రభుత్వ ఉద్యోగి కోల్ కతా న్యూటౌన్ ఏరియాలోని కరిగారి భవన్ లో టెక్నికల్ ఎడ్యూకేషన్ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తున్నాడు. నార్త్ 24 పరగనాలోని సోద్ పూర్ ఘోలాలో నివాసం ఉంటున్న అమిత్ సర్కార్.. సెలవు రాలేదనే కోపంతో కొలీగ్స్ వాగ్వాదానికి దిగాడు. కత్తితో నలుగురుని పొడిచి వెళ్లిపోయాడు’’ అని సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఒకరు తెలిపారు. 

సహోద్యోగులను పొడిచిన అమిత్ సర్కార్.. అదే కత్తితో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లటాన్ని కొందరు ఫోన్ తో వీడియో తీశారు. వీడియో తీస్తే పొడిచేస్తానని బెదిరిస్తూ వేగంగా వెళ్లిపోయాడు. ఒక చేతిలో కత్తి, మరో చేతిలో బ్యాగ్ తో వేగంగా నడవటం చూసి అక్కడున్న స్థానికులు భయానికి గురయ్యారు. 

జయ్ దేవ్ చక్రవర్తి, శంతను సాహ, శార్థ లతే, షేక్ సతాబుల్ అనే నలుగురు ఉద్యోగులను పొడవటంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెబుతున్నారు.

అమిత్ ను అరెస్టు చేసి విచారిస్తున్నారు పోలీసులు. అయితే అతనికి లీవ్ ఇవ్వడానికి ఎందుకు నిరాకరించారు, ఆ కోపంతో ఉద్యోగులపై ఎందుకు దాడికి దిగాడనేది తెలియాల్సి ఉంది.