గృహహింస, అత్తింటివారి వేధింపులు కొనసాగుతున్నాయి అనడానికి ఇదొక ఎగ్జాంపుల్.. కాలం మారింది. టెక్నాలజీ యుగంలో దూసుకెళ్తున్నాం.. ఎంతో మెచ్యూరిటీ తో లైఫ్ కొనసాగిస్తున్న ఇలా పరిస్థితుల్లోకూడా అక్కడక్కడా ఇలాంటి వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. అత్తింటివారి వేధింపులు భరించలేక ఓ మహిళ పోలీసు లను ఆశ్రయించిన ఘటన బీహార్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే..
బీహార్కు చెందిన ఓ మహిళా.. భర్త తన సరిగా కాపురం చేయడం లేదని..రెండేళ్లు శారీరక సంబంధాలు లేవని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది ఓ మహిళ. భర్త సహా ఇందుకు కారణమైన ఆరుగురి పేర్లను ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు.
బీహార్ లోని వైశాలి జిల్లాలోని లాల్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళ.. తన భర్త రెండేళ్లుగా తనతో కాపురం చేయడంలేదని..కేసు పెట్టింది. ఎఫ్ఐఆర్లో షాకింగ్ విషయాలు వెల్లడించింది.
నాకు పెళ్లి జరిగి 2021 మే జరిగింది. పెళ్లాయ్యాక అత్తమామల ఇంటికి వెళ్లాను. పెళ్లియిన రెండేళ్ల వరకు నా భర్తకు నాతో ఎలాంటి శారీరక సంబంధాలు లేవు. మా అత్తమామలకు చెబితే వారు నాకు ఎలాంటి సహాయం చేయలేదు. నేను నా భర్తను నిలదీస్తే నన్ను తిట్టడం , కొట్టడం చేస్తున్నాడు. నా తల్లిదండ్రులకు దగ్గరకు వెళ్లాలని ప్రయత్నించినప్పుడు నన్ను చంపుతామని బెదిరిస్తున్నారు అని ఆ మహిళ ఎఫ్ ఐఆర్ లో తెలిపింది.
అయితే ఈ కేసుపై పోలీసులు స్పందిస్తూ.. వారివురికి కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ, పరిస్థితి అలాగే ఉంది.. అందుకే కేసు నమోదు చేశామని చెపుతున్నారు. అన్ని వెర్షన్లు,క్లెయిమ్ లను దృవీకరించి దర్యాప్తు చేస్తున్నామని ఐపీసీ సెక్షన్ 341,323, 498ఎ, 379, 504, 506, 34 సెక్షన్ల కింద ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు పోలీసులు.
వివాహం రద్దు చేసుకొని తన తల్లిదండ్రుల దగ్గర పోదామంటే.. నన్ను చంపుతామని తన భర్త, అత్తామామలు బెదిరిస్తున్నారని బాధిత మహిళ పోలీసులు ఫిర్యాదు చేసింది. ఎంతో సహనంగా ఉన్నప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో తాను పోలీసులను ఆశ్రయించినట్లు ఎఫ్ ఐఆర్ లో పేర్కొంది.