కరోనా భయంతో కోటి జంతువులను చంపేస్తున్న డెన్మార్క్

పాపం మింక్స్

కోటికి పైగా ఉన్న మింక్స్.. చంపేయాలని ప్రభుత్వ నిర్ణయం

మింక్స్ నుంచి మనుషులకు కరోనా సోకుతోందని, వాటిని చంపేయాలని డెన్మార్క్ నిర్ణయించింది. మింక్స్ నుంచి మనుషులకు సోకే కరోనా వైరస్ లో ఒక మ్యుటేషన్ గుర్తించామని, అది కరోనా వ్యాక్సిన్ ఎఫెక్టివ్ గా పని చేయడాన్ని అడ్డుకుంటుందని స్టేట్ సీరమ్ ఇనిస్టిట్యూట్ హెడ్ కరే మోల్బక్ హెచ్చరించారు.  దీంతో దాదాపు వెయ్యి ఫారాల్లో పెంచుకుంటున్న మింక్స్ ను చంపేసేందుకు డెన్మార్క్  సిద్ధమైంది. ‘మా దేశంలో కోటిన్నర మింక్స్ ఉన్నాయి. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు వాటిని ఆర్మ్డ్ ఫోర్సెస్ సాయంతో చంపేస్తున్నాం’అని డెన్మార్క్ ప్రధాని మెట్టె ఫ్రెడ్రిక్సన్ ప్రకటించారు. మింక్స్ ద్వారా సోకే  కొత్త కరోనా వైరస్ లో మ్యుటేషన్ కు సంబంధించి డెన్మార్క్ ప్రభుత్వం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ఓ)కు సమాచారమిచ్చింది.  జట్లాండ్ రీజియన్ లో ఇప్పటికే 12 మందికి మింక్స్ ద్వారా కరోనా వైరస్ సోకిందని, వారిలో యాంటీబాడీల రియాక్షన్ బలహీనంగా ఉన్నట్టు వివరించింది. మింక్ ల నుంచి కరోనా వైరస్ సోకడంపై డెన్మార్క్ సర్కారు తమకు సమాచారం ఇచ్చిందని, వైరస్ లో కొన్ని జెనెటిక్ చేంజస్ గురించి కూడా వివరించినట్టు  డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. వీజల్ ఫ్యామిలీకి చెందిన మింక్స్ లను బూర కోసం రైతులు పెంచుకుంటారు. ప్రపంచంలోనే మింక్స్ బూర ఎగుమతి చేసే అతి పెద్ద దేశం డెన్మార్క్. మింక్స్ లు సులువుగా కరోనా బారిన పడతాయని, గుంపులుగా ఉండే ఈ జంతువుల్లో వైరస్ వ్యాప్తి స్పీడ్ గానే ఉంటుందని ఎక్స్ పర్ట్స్ అంటున్నారు.డెన్మార్క్ లో ఇప్పటికే 400 ఫారంలలో మింక్స్ ను చంపడం మొదలైంది. దీంతో మింక్స్ పెంపకం పరిశ్రమ పూర్తిగా తుడిచిపెట్టుకుని పోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. మింక్స్ ద్వారా సోకే కరోనా వైరస్ లో ఒక మ్యుటేషన్ మనుషుల్లో వ్యాక్సిన్ ఎఫెక్టివ్ గా పని చేయడాన్ని అడ్డుకుంటుందనేందుకు  ఎలాంటి రిపోర్ట్స్ పబ్లిష్ కాలేదని, మ్యుటేషన్ నేచర్ ఎలా ఉంటుంది?, వైరస్ వేరియెంట్ ను ఎలా టెస్ట్ చేశారు? ఇలాంటి వివరాలు తెలియకుండా దీనిపై ఒక అంచనాకు రాలేమని ఐయోవా యూనివర్సిటీ మైక్రోబయాలజిస్ట్, కరోనా వైరస్ స్పెషలిస్ట్  డాక్టర్ స్టాన్లీ పెర్ల్ మన్ అన్నారు. ఇప్పటి వరకు తాను ఎలాంటి వివరాలు చూడలేదని, ఎవరైనా కొత్త వేరియంట్ సీక్వెన్సెస్ రిలీజ్ చేయాలని ఎకో హెల్త్ అలయన్స్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ జోనాథన్ ఎప్ స్టేన్​ చెప్పారు.

For More News..

తొమ్మిదో తరగతి స్టూడెంట్‌కు రూ.2.92 లక్షల ఫీజు

అర్ణబ్ గోస్వామికి 14 రోజుల రిమాండ్

రైజర్స్‌ జోరు సాగేనా! నేడు బెంగుళూరుతో ఎలిమినేటర్ మ్యాచ్