ఒడెన్స్: డెన్మార్క్ ఓపెన్‌లో స్టార్ షట్లర్ పీవీ సింధు ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించగా, లక్ష్యసేన్ తొలి రౌండ్‌లోనే ఓడి నిరాశపరిచాడు. మంగళవారం జరిగిన విమెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో పాయ్ యు పో (చైనీస్‌తైపీ) మ్యాచ్ మధ్యలో వైదొలగడంతో సింధుకు వాకోవర్ విజయం లభించింది.
ఇతర మ్యాచ్‌ల్లో ఆకర్షి కశ్యప్ 13–21, 21–21తో సుపానిదా కెటాహోంగ్ (థాయ్‌లాండ్) చేతిలో, మాళవిక బన్సోద్ 13–21, 12–21తో ఎనుగుయెన్ తు లిన్హ్ (చైనా) చేతిలో ఓడారు. మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో లక్ష్యసేన్ 21–12, 19–21, 14–21తో లు గువాంగ్ జు (చైనా) చేతిలో కంగుతిన్నాడు. విమెన్స్ డబుల్స్‌లో రుతుపర్ణ–శ్వేతపర్ణ 18–21, 22–24తో చాంగ్ చింగ్ హు–యాంగ్ చింగ్ టాన్ (చైనీస్‌తైపీ) చేతిలో ఓడారు.